ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి
-టీడిపి పార్లమెంట్ అడహాక్ కమిటీ సభ్యులు వడ్డెం విజయ్
ఖమ్మం /అక్షిత బ్యూరో :
తెలుగుదేశంపార్టీ వ్యవస్ధాపకులు మాజీ ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి ఈ నెల 28 న ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ పార్లమెంట్ అడాహాక్ కమిటీ సభ్యులు వడ్డెం విజయ్ పిలుపునిచ్చారు.ఖమ్మం నగరంలోని అన్ని డివిజన్లో ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా చేయాలని అన్నారు.ఈ నెల 27,28,29 తేదీల్లో కడపలో తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే యువ మంత్రి లోకేష్ బాబు నేతృత్వంలోతెలుగు వారి పండగ మహానాడు ఘనంగా జరుపుకుంటున్నామని దానిలో భాగంగా ఖమ్మం నగర కమిటీ పరిధిలోని అన్ని డివిజన్ లలోని కార్యకర్తలు ఆ మహనీయుని జయంతి ని ఘనంగా జరపుకోవాలని వారు కార్యకర్తలను కోరారు. పార్టీ జెండా ఎగురవేసి ఆ మహనీయునికి ఘన నివాళులుఅర్పించాలని కోరారు.