భూ భారతి సదస్సులు

నేటి నుండి 17 వరకు  రెవిన్యూ సదస్సులు

వేములపల్లి తహశీల్దార్ హేమలత

అక్షిత న్యూస్, వేములపల్లి :

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భూ భారతి చట్టంపై రైతులకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు వేములపల్లి మండలంలోని 12 గ్రామపంచాయతీలలో ఈ నెల 3వ తేదీ నుండి 17 వరకు 15 రోజులపాటు రెవెన్యూ సదస్సులను నిర్వహించనున్నట్లు వేములపల్లి తహసిల్దార్ బహునూతల హేమలత తెలిపారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ ఆదేశాలమేరకు జూన్ 3. నుండి 17 వరకు మండలంలోని రెవిన్యూ గ్రామాలలో సంబంధించిన అధికారుల బృందం షెడ్యూల్ లో చూపిన ప్రకారంగా రెవిన్యూ సదస్సులను నిర్వహించడంజరుగుతుందన్నారు.రెవిన్యూ సదస్సులలో అన్ని రకాల భూ సమస్యలను నిర్దేశించబడిన దరఖాస్తులలో స్వీకరించడం జరుగుతుందని ఆమె తెలిపారు. మండల ప్రజలు రైతులు ప్రభుత్వం కల్పించిన ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోని రైతు సదస్సులో పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు. రెవిన్యూ సదస్సులు-నిర్వహించు బృందాల వివరాలు:ఈ నెల.3 న ఆమనగల్లు గ్రామంలోని గ్రామపంచాయతీ ఆవరణలో ,4 న అన్నపురెడ్డిగూడెం గ్రామపంచాయతీ లో,5 న బుగ్గ బావి గూడెం గ్రామపంచాయతీ ఆవరణలో, 6న చలి చీమలపాలెం గ్రామపంచాయతీ ఆవరణలో,9 న శెట్టిపాలెం గ్రామపంచాయతీ ఆవరణలో, 10 న కామేపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో, 11 న మొల్కపట్నం గ్రామపంచాయతీ ఆవరణలో,12 న రావులపెంట గ్రామపంచాయతీ ఆవరణలో,13 న సల్కునూర్ గ్రామపంచాయతీ ఆవరణలో,16 నా తిమ్మారెడ్డి గూడెం గ్రామపంచాయతీ ఆవరణలో,17 న వేములపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉదయం 9 గంటల నుండి 4 గంటల వరకు రెవిన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. వ్యవసాయ భూముల యజమానులు రైతులు తమ భూమి రికార్డుల తప్పులు ఉండబడిన, రెవెన్యూ రికార్డుల పేర్లు నమోదు కాకపోయిన, రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తామని ఆమె తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking