ప్రజలకు చేరువలో… ఉచిత అంబులెన్స్

దేవరకొండ పట్టణ ప్రజలకు అందుబాటులో ఉచిత అంబులెన్స్

క్రైస్తవ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు మాసారం ప్రేమ్ కుమార్

దేవరకొండ / అక్షిత ప్రతినిధి :

క్రైస్తవ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు వ్యవస్థాపకులు ఓయూ ఉద్యమ నేత మాసారం ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో దేవరకొండ పట్టణ ప్రాంత ప్రజలకు ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవుని ప్రాణం ఎంతో విలువైనది అని ,ఆ విలువైన ప్రాణాన్ని అత్యవసరం సమయములో కాపాడేందుకు అంబులెన్స్ ఎంతో దోహదపడుతుంది అనే ఉద్దేశంతో దేవరకొండ పట్టణ ప్రాంత ప్రజలకు ఉచిత అంబులెన్స్ సేవలు దేవరకొండ బస్టాండ్ సమీపములో,అంబులెన్స్ దాత ,ప్రముఖ సినీ హీరో ,మానవతావాది ఫిలిమ్స్ ఛాంబర్స్ అధ్యక్షులు, మంచు విష్ణు సినీ హీరో శివ బాలాజీ తో క్రైస్తవ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ఓయూ ఉద్యమ నేత మాసారం ప్రేమ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ చిన్నవాడు అయిన ప్రేమ కుమార్ చాలా సేవా దృక్పథం కలవాడని ఆయన నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చని మంచు విష్ణు అన్నారు. అనంతరం అంబులెన్స్ ను ప్రారంభించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు సంఘాల నాయకులు మేధావులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking