అభిమాన జర్నలిస్టుతో అక్షరభ్యాసం

అభిమాన జర్నలిస్టుతో అక్షరభ్యాసం

హరిచరణ భవిష్యత్తు చదువుకు తోడుంటా 

టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కే.విరాహత్ అలీ

గజ్వేల్, అక్షిత ప్రతినిధి :
చదువులో తమ పిల్లలు రాణించాలనే మొక్కుబడితో సాధారణంగా ఆలయాల్లో వేద పండితుల చేతుల మీదుగా తమ పిల్లలకు తల్లిదండ్రులు అక్షరాభ్యాసం చేయిస్తుండడం చూస్తుంటాం. కానీ దశబ్దాలుగా తమ కుటుంబానికి చేదోడు, వాదోడుగా నిలిచి అభిమానాన్ని చూరగొన్న ప్రజా జర్నలిస్టుతో తమ కూతురికి అక్షరాభ్యాసం చేయించి, వారి కోరికను తీర్చుకున్నారు. ఆ తల్లిదండ్రులు. వివరాల్లోకి వెళ్తే…సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ కు చెందిన సోము బాల్ నర్సయ్య కుటుంబం, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కే.విరాహత్ అలీకి గత 40యేండ్లుగా వీర అభిమానులు. పదకొండేండ్ల క్రితం బాల్ నర్సయ్య మృతి చెందినప్పటికీ, అతని కుమారులు సోము యాదగిరి, సోము కుమార్ లు అదే అభిమానాన్ని కొనసాగిస్తున్నారు. నాటి నుండి నేటి వరకు ఆ కుటుంబానికి విరాహత్ అలీ చేదోడుగా నిలిచారు. అయితే తమ అభిమాన అక్షర యోధుడు విరాహత్ అలీ చేతుల మీదుగా తమ కూతురికి అక్షరభ్యాసం చేయించాలనేది వారి కోరిక.

దీంతో బుధవారం నాడు ఆ కుటుంబం బషీర్ బాగ్ లోని టీయూడబ్ల్యూజే కార్యాలయానికి చేరుకొని విరాహత్ అలీ చేతుల మీదుగా చిన్నారి హరిచరణకు అక్షరాభ్యాసం చేయించుకొని ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్బంగా విరాహత్ అలీ మాట్లాడుతూ, తన పట్ల యాదగిరి కుటుంబానికి ఉన్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. హరిచరణ చదువుకు భవిషత్తులో తన పూర్తి సహకారం ఉంటుందని, ఆమె సమాజంలో ఉత్తమురాలిగా, ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీర్వదించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking