యశోద హాస్పిటల్ లో అరుదైన శస్త్ర చికిత్స
–63 సంవత్సరాల మహిళకు రోబోటిక్ టైలేటరల్ మోకాలి మార్పిడి ద్వారా సరికొత్త జీవితాన్ని అందించిన యశోద హాస్పిటల్స్
ఖమ్మం/అక్షిత బ్యూరో :
దీర్ఘకాలికంగా రెండు మోకాళ్లలో తీవ్రమైన ఆస్టియో ఆర్థరైటిస్తో బాధపడుతున్న ఖమ్మంకు చెందిన 63 ఏళ్ల మహిళ సత్యవతి జోనిబోయినాకు ద్విపార్శ్య రోబోటిక్ టోటల్ ని రీప్లేస్మెంట్ విజయవంతంగా పూర్తి చేసినట్లు యశోద హాస్పిటల్స్ గర్వంగా ప్రకటించింది. దీర్ఘకాలిక ద్విపార్శ్వ మోకాలి నొప్పి కీళ్ల దృఢత్వం నడవడానికి ఇబ్బంది వంటి సమస్యలతో శ్రీమతి సత్యవతి యశోద హాస్పిటల్ కి వచ్చారు.ఇది ఆమె రోజువారీ కార్యకలాపాలను గణనీయంగా ప్రభావితం చేసింది.క్లినికల్ పరీక్షలు మరియు డయాగ్నస్టిక్ ఇమేజింగ్ రెండు మోకాళ్లలో అధునాతన ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నట్లు నిర్ధారించాయి దీనితో ఆమెకు రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ అవసరమని డాక్టర్లు నిర్ధారించారు.ఈ ప్రక్రియను మే 10, 2025 న చీఫ్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఉదయ్ కృష్ణ మైనేని మరియు బృంద సభ్యులైన కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ ట్రామా రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ రవీష్ అజ్మీరా అదునాతన స్మిత్ నెఫ్యూ కొరి రోబోటిక్ సిస్టమ్ ని ఉపయోగించి నిర్వహించారు. ఉన్నతమైన మన్నిక తక్కువ బరువు కలిగిన ఆక్సీనియం ప్రొస్థెసిస్ ఇంప్లాంట్లను ఈ సర్జరీలో ఉపయోగించారు. “రోబోటిక్ కీళ్ల మార్పిడి బోన్ కట్స్ మరియు అమరికలో గతంలో ఎన్నడూ లేనంత ఖచ్చితంగా చేయడానికి వీలవుతుంది ఇది కీళ్ల జీవితకాలం మరియు రోగి జీవనశైలిని మెరుగుపరచడంలో కీలకం. శ్రీమతి సత్యవతి కేసు ఆధునిక పద్ధతులు ముందస్తు రోగ నిర్ధారణ మరియు నిపుణుల సంరక్షణతో కలిపితే తిరిగి నడవడం మరియు జీవన నాణ్యతను అత్యుత్తమంగా ఎలా పునరుద్దరించగలవో రుజువు చేస్తుంది అని యశోద హాస్పిటల్స్ హిప్ మోకాలి రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉదయ్ కృష్ణ మైనేని (ఆర్థో,యూకే ) మరియు బృంద సభ్యులైన కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ ట్రామా రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ రవీష్ అజ్మీరా అన్నారు.సర్జరీ తర్వాత పేషేంట్ కు క్వాడ్రిసెప్స్ మరియు హామ్ స్టింగ్ బలోపేతం మోకాలి రోమ్ వ్యాయామాలు వాకర్ సహాయంతో నడిపించడం మరియు అంకితమైన ఫిజియోథెరపీ లభించింది.వీటి వలన త్వరగా లేచి నడవడమే కాకుండా అత్యంత తక్కువ సమయంలోనే నొప్పి కూడా తగ్గడంతో ఆరోగ్యమైన స్థితిలో ఆమె డిశ్చార్జ్ చేయబడ్డారు. విజయవంతంగా నిర్వహించిన ఈ సర్జరీ ఆర్థోపెడిక్ విభాగంలో యశోద హాస్పిటల్స్ యొక్క నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తుంది.కీళ్ల రుగ్మతలతో బాధపడుతున్న పేషింట్లకు రోబోటిక్ సర్జరీ కంప్యూటర్ నావిగేషన్ వంటి అత్యాధునిక పరిష్కారాలను అందిస్తుంది.యశోద హాస్పిటల్స్ గురించి గత 30 సంవత్సరాలుగా హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 4 బ్రాంచ్ లు ( సికింద్రాబాద్ , సోమాజిగూడ మరియు మలకేట్ , హైటెక్ సిటీ ) 4 వేల పడకలు కలిగి ఉన్న అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య అవసరాలకు అనుగుణంగా అనుభవంతులైన వైద్యులచే అధునాతన సాంకేతికతలతో ఇప్పుడు అందరికి చేరువలో కార్పొరేట్ వైద్య సేవలు చురుకైన నాయకత్వం మరియు బలమైన నిర్వహణ వైద్య చికిత్సలో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలను అందించే అత్యుత్తమ కేంద్రంగా యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అభివృద్ధి చెందింది.పెషంట్ అవసరాలకు అనుగుణంగా అనునిత్యం మార్గనిర్దేశం చేయబడుతుంది.అరుదైన సంక్లిష్టమైన విధానాలకు కూడా సంపూర్ణ మిళిత విప్లవాత్మక సాంకేతికత ద్వారా చికిత్సలను అందిస్తుంది. యశోద గ్రూప్ మెడిసిన్ మరియు సర్జరీకి సంబంధి సాంకేతికత ద్వారా చికిత్సలను అందిస్తుంది. యశోద గ్రూప్ మెడిసిన్ మరియు సర్జరీకి సంబంధించిన ప్రతి స్పెషాలిటీ మరియు సబ్ స్పెషాలిటీలో అధునాతన రోగనిర్ధారణ మరియు చికిత్సా సంరక్షణను అందించడం ద్వారా వైద్య నైపుణ్యం మరియు అధునాతన విధానాలను నిర్వహిస్తుంది. భారతదేశంలోనే అతిపెద్ద వైద్య సదుపాయాలలో ఒకటిగా భావిస్తున్న తెలంగాణలోని హైదరాబాద్ లో 4000 పడకల సామర్ధ్యంతో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. సరసమైన ఖర్చులతో యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తుంది.