అంచెలంచెలుగా ఎదిగిన అక్షిత

అంచెలంచెలుగా
ఎదిగిన అక్షిత

భవిష్యత్ లో
మరింత ముందుకు

*జర్నలిజం విలువలకు నిలువెత్తు నిదర్శనం అక్షిత జాతీయ తెలుగు దినపత్రిక*

*తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు జక్కుల విజయకుమార్*

వరంగల్, అక్షిత బ్యూరో :

ఇంతింతై వటుడింతై అన్న చందంగా అక్షిత అంచెలంచెలుగా ఎదుగుతుందని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు జక్కుల విజయకుమార్ అన్నారు. గురువారం స్థానికంగా అక్షిత తెలుగు జాతీయ దిన పత్రిక వరంగల్ బ్యూరో చీఫ్ డా. పాలడుగు సురేందర్ ఆధ్వర్యంలో అక్షిత సంబరాలు జరిగాయి. దశాబ్దాంన్నర కాలంగా పత్రికను ప్రధాన స్రవంతి కల్గిన పత్రికలకు ధీటుగా సీనియర్ జర్నలిస్ట్ దాస్ మాతంగి సారథ్యంలో అక్షిత జాతీయ తెలుగు దినపత్రికను స్థాపించి 15 ఏళ్లుగా నిరవధికంగా ప్రచురిస్తుండడంతోనే మీడియం పత్రికల్లో చేరిందన్నారు. కొలది కాలంలోనే మరింత ముందుకు సాగి ప్రధాన స్రవంతి కల్గిన పత్రికల సరసనకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ స్థాయికి చేరుకోవడానికి యాజమాన్యంకు తోడు జర్నలిస్టుల విశ్రాంత కృషి తోడ్పాటు అభినందనీయమన్నారు. అహర్నిశలు కృషిచేసి అనేకమంది కొత్త జర్నలిస్టులకు అవకాశం కల్పిస్తూ జర్నలిజం విలువలకు అక్షర దర్పణం పడుతుందన్నారు. తొలుత 4 పేజీలతో అడిగిడి 4 నుంచి 8 పేజీలు, ఎనిమిది నుంచి 16 పేజీలతో టాబ్లాయిడ్ కూడా ఇస్తుండడం తద్వారా రాష్ట్రంలోని నలుమూలల వార్తలు నికార్సుగా క్రైమ్, పొలిటికల్, స్పోర్ట్స్, సినిమా, పర్యావరణం, సంక్షేమం, పొలిటికల్, మహిళా చైతన్యం, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, స్థానిక సంస్థల పాలన, అక్రమ నిర్మాణాలు, అన్యాయాల పైన అక్షర యుద్ధం సాగిస్తూ ఇలా అన్ని రంగాల్లో ప్రజల గొంతుకై ప్రజల సంక్షేమం కోసం పేద ప్రజల చైతన్యానికి అక్షర యజ్ఞం సాగిస్తూ, గొంతు లేని వారి గొంతుకై ముందుకు సాగుతున్న గొప్ప పత్రిక అక్షిత అని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు జక్కుల విజయకుమార్ అన్నారు. భవిష్యత్తులో ప్రధాన పత్రిక స్రవంతిలో చేరి అక్షిత జాతీయ తెలుగు దినపత్రిక ఇంకా గొప్ప స్థానాన్ని అధిరోహించాలని కోరుకుంటున్నట్లు పలు సంఘాల నాయకులు, జర్నలిస్టులు, ప్రజా ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, అక్షిత జాతీయ తెలుగు దినపత్రిక వరంగల్ జిల్లా బ్యూరో చీఫ్ డాక్టర్ పాలడుగుల సురేందర్, వివిధ పత్రికల ప్రతినిధులు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking