అక్షరంతోనే ఉజ్వల భవిష్యత్తు
వెల్మగూడెం ప్రాథమిక పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసo
హాలియా, అక్షిత ప్రతినిధి :
అక్షరంతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని మండల విద్యాధికారి తరి రాము అన్నారు. బాల్యం నుంచే చదువు పట్ల ఆసక్తిని కల్గి ఉండాలన్నారు. శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట లో భాగంగా వెల్మగూడెం ప్రాథమిక పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసo జరిగింది. ఈ సందర్భంగా మండల విద్యాధికారి తరి రాము మాట్లాడుతూ ఈ సామూహిక అక్షరాభ్యాసoతో పిల్లల్లో చదువుపట్ల ఆసక్తి పెంపొందించడంతోపాటు, విద్య ప్రారంభ దశలోనే పాఠశాల పట్ల సానుకూల దృక్పథం కలిగించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసిందన్నారు. పిల్లల తల్లిదండ్రులు, గురువుల మార్గదర్శనంలో వర్ణమాల, అక్షరాల జ్ఞానం నేర్చుకునేలా ప్రతి పాఠశాలలో ఆట, పాటల ద్వారా కృత్యాధారంగా బోధనా అభ్యసన ప్రక్రియ జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మన్నెం వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు ఎండి రహీం, నామిరెడ్డి ప్రశాంతి, ఉప్పునూతల వెంకయ్య, అంగన్వాడి టీచర్ పుష్పలత విద్యార్థిని, విద్యార్థులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.