మంత్రిగా వాకిటి బాధ్యతల స్వీకరణ

*సచివాలయంలో బాధ్య‌తలు స్వీక‌రించిన మంత్రి వాకిటి శ్రీహ‌రి*

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా వాకిటి శ్రీహ‌రి సోమ‌వారం డా.బీఆర్. అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో ప‌ద‌వీ బాధ్య‌తలు స్వీక‌రించారు. ఉదయం సచివాలయానికి చేరుకున్న మంత్రి వాకిటి శ్రీహ‌రికి వేదమంత్రోచ్ఛారణలతో పండితులు స్వాగతం పలికారు. అనంతరం తన ఛాంబర్ లో వాకిటి ప్రత్యేక పూజలు చేసి, బాధ్యతలు చేపట్టారు.

ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌, ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు.. ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు, అభినంద‌న‌లు తెలియ‌జేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking