*మంత్రి సీతక్కను కలిసిన ఎమ్మెల్యే మందుల సామేలు*
అడ్డగూడూర్, అక్షిత ప్రతినిధి :
హైదరాబాదు ప్రజాభవన్ లో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్కను మర్యాద పూర్వకంగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు కలిశారు. తుంగతుర్తి నియోజకవర్గం లోని పలు మండలాలు అడ్డ గూడూరు, మోత్కూరు, శాలిగౌరారం మండలాలకు సంబంధించి పంచాయతీరాజ్ రోడ్డు మరియు ఎస్సీ సబ్ ప్లాన్ కి సంబంధించి నిధులు కేటాయించాలని వినతిపత్రం అందజేశారు. మండలాల అభివృద్ధి కొరకై సానుకూలంగా మంత్రి స్పందించినట్లు ఎమ్మెల్యే మందుల సామేలు పత్రిక ప్రకటనలో తెలిపారు.