ఘనంగా రఘునందన్ రెడ్డి జన్మదిన వేడుకలు
తిరుమలగిరి,అక్షిత ప్రతినిధి:-
పేద ప్రజల ఆశాజ్యోతి తిరుమలగిరి మండల అభివృద్ధి దాత నిస్వార్థ ప్రజా సేవకుడు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ అన్న అంటే నేను ఉన్న అంటూ అనునిత్యం ప్రజాసేవకే అంకితమై,పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ కు తుంగతుర్తి నియోజకవర్గం లోనిముఖ్య నాయకుని గా ఉంటూ మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లిన మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తిరుమలగిరి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం నాడు మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సంకేపల్లి నరోత్తం రెడ్డి, బి ఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు దుపటి రవీందర్ , ఎస్సీ సెల్ మండల శాఖ అధ్యక్షులు కందుకూరి బాబు, ఎస్టీ సెల్ అధ్యక్షులు యాకూబ్ నాయక్, బి ఆర్ ఎస్ నాయకులు మాజీ సర్పంచ్ ఆకుల వీరయ్య, వేల్పుల లింగయ్య ,ఎండి షకిల్ పాషా, కొంపెల్లి రామ్మూర్తి గౌడ్, యాకుబ్ పాషా, దయా యాదవ్, కారుపోతుల నరేష్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.