ఫిలిం అవార్డు జ్యూరీ సభ్యులుగా ఉత్తమ సేవలందించి డిప్యూటీ సీఎం భట్టి నుండి మెమెంటో అందుకున్న మిర్యాలగూడ వాసి మధు
మిర్యాలగూడ జూన్ 15 అక్షిత ప్రతినిధి :
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన ప్రముఖ సీనియర్ జర్నలిస్టు, ఎఫ్డిసి రిటైర్డ్ జనరల్ మేనేజర్ వాకిటి మధుకు ఆదివారం హైదరాబాద్ హైటెక్ సిటీలో జరిగిన గద్దర్ అవార్డ్స్ లో బెస్ట్ జ్యూరీ మెంబర్ గా మెమెంటో, ప్రశంసా పత్రాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట రోడ్డు భవనాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మెమెంటోను అందుకున్నారు. ఆయనకు ఉత్తమ జ్యూరీ సభ్యుడిగా ఫిలిం అవార్డు ఎంపికలో ఉత్తమ విధులు నిర్వహించినందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.