ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య

ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య

బడిబాటతో అనూహ్య స్పందన

మండల విద్యాధికారి కే. శ్రీనివాస్

అక్షిత న్యూస్, తిరుమలగిరి (సాగర్):

నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలల్లోనే లభిస్తుందని మండల విద్యాశాఖ అధికారి కే. శ్రీనివాస్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం తిరుమలగిరి సాగర్ మండలంలోని చెంచొని తండ ప్రాథమిక పాఠశాలలో జరిగిన సమావేశంలో పాల్గొని పాఠశాలలో నూతనంగా చేరిన విద్యార్థుల చేత సామూహిక అక్షరాభ్యాసాన్ని చేయించారు.

సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తులు, ఉపాధ్యాయుల సహకారంతో మూతపడే స్థాయి నుంచి విద్యార్థుల సంఖ్యను 20 వరకు పెంచడం జరిగిందన్నారు. అనంతరం జరిగిన పేరెంట్స్ టీచర్స్ కమిటీ సమావేశంలో విద్యార్థిని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ , నోట్ బుక్స్, పెన్సిల్లు ,పెన్నులు అందజేశారు. ఎంఈఓ కృషి, పాఠశాల హెచ్ఎం సహకారంతో పాఠశాల సంఖ్య పెంపును, సొంత ఖర్చులతో పాఠశాల చుట్టూ స్టీల్ కంచెను ఏర్పాటు చేశారని విద్యార్థుల తల్లిదండ్రులు కొనియాడారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం సుహాసిని, సిఆర్పి రంగస్వామి, అంగన్వాడీ టీచర్, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్, సభ్యులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking