హాస్టళ్లపై మీ చూపుండాలి

హాస్టళ్లపై మీ చూపుండాలి

హైదరాబాద్ కలెక్టర్ హరిచందనకు తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ వినతి

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

పేద విద్యార్ధులుండే వసతి గృహాలపై మీ చల్లని చూపుండాలని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ అభ్యర్థించింది. మంగళవారం హైదరాబాద్ కలెక్టర్ గా హరిచందన బాధ్యతలు స్వీకరించిన అనంతరం తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ కూరెళ్ళ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో అసోసియేషన్ నేతలు కలిసి అంబేద్కర్ చిత్ర పటాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లాలో ఉన్న అన్ని ఎస్సి సంక్షేమ వసతి గృహాలపై దృష్టి సారించి మంచి విద్యా, వసతి సదుపాయాలను కల్పించేందుకు చొరవ చూపాలని కోరారు. వారానికి లేదా నెలకు రెండుసార్లు సంక్షేమ హాస్టళ్లను పర్యవేక్షించాలని కోరడంతో అందుకు సానుకూలంగా స్పందించి సంక్షేమ హాస్టల్స్  పనితీరును మెరుగుపరచి, పేద బిడ్డల ఉజ్వల భవిష్యత్తుకు అందరి సహకారంతో ముందుకు వెళ్తామన్నారు. ఆయన వెంట రాష్ట్ర కోఆర్డినేటర్ నక్క రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking