సుభాష్ నగర్‌లో అక్రమ నిర్మాణాల పర్వం
నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిన టౌన్ ప్లానింగ్ శాఖ
అక్షిత న్యూస్ / గాజులరామారం :
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుభాష్ నగర్ కాలనీ అక్రమ నిర్మాణాల కేంద్రంగా మారింది. బిల్డింగ్ నిబంధనలను పక్కన పెట్టి భవనాల నిర్మాణం సాగుతోంది. అంతే కాక, పలు నివాస భవనాలను వాణిజ్య వాడకానికి మార్చడమూ ఈ ప్రాంతంలో నిత్య కృత్యమైంది.
పక్కా పర్మిషన్ లేకుండా అక్రమ నిర్మాణాలు
ఇక్కడ కొంతమంది బిల్డర్లు టౌన్ ప్లానింగ్ అధికారుల సహకారంతో అక్రమంగా గృహాలు, అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నారు. పర్మిషన్ లేకుండా మూడంతస్తుల భవనాలు, రెసిడెన్షియల్ ప్లాట్లపై వాణిజ్య కాంప్లెక్సులు కడుతున్నారు , గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఆధాయానికి గండి కొడుతున్నారు.

ప్రజల ఆరోపణలు – అధికారుల మౌనం
స్థానిక నివాసితులు అధికారుల వద్ద అనేక ఫిర్యాదులు చేసినా, టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి ఎలాంటి స్పందన లేదు. ‘‘ఫిర్యాదు చేస్తే ఊరికే ఫైల్ మూటలు పడతాయి, కానీ ఆక్రమణలు మాత్రం ఆగవు’’ అని స్థానికులు వాపోతున్నారు.