అతివకి అండగా…!
మహిళలకి ఆర్ధిక వనరుగా మారుతున్న ఇందిరా మహిళా శక్తి పథకం…!!
బచ్చన్నపేట ఎంపీడీఓ కార్యాలయం లో వనిత టీ స్టాల్ ని ప్రారంభించిన కలెక్టర్…!!!
మహిళల ఆర్ధిక స్వాలంబనే లక్ష్యం…!!!!
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్…!!!!!
జనగామ/ బచ్చన్నపేట, అక్షిత ప్రతినిధి:
రాష్ట్రంలోని కోటి మంది మహిళా మణులను కోటీశ్వరులగా తీర్చిదిద్దాలనే మహోన్నత లక్ష్యంతో ఇందిరా మహిళాశక్తి పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని… అందుకనుగుణంగా మహిళా సంఘా సభ్యులతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వివిధ యూనిట్ లను ప్రారంభించడం జరుగుతుందని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు.బచ్చన్నపేట మండలంలోని ఎంపీడీవో, తహసిల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మండలంలోని పోచన్నపేట గ్రామానికి చెందిన రేణుక అనే ఎస్ హెచ్ జి సభ్యురాలు రచన మహిళా సమైక్య ద్వారా రెండు లక్షల ఋణం పొంది వనిత టీ స్టాల్ ని ఏర్పాటు చేసుకున్నారు.దీనిని గురువారం అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ప్రారంభించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ…. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నామని… జిల్లాలోని ఆయా గ్రామాల్లో అర్హులైన మహిళలకు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా బ్యాంక్‌ల నుంచి రుణాలు అందేలా చేసి…. ఒక ప్రణాళికతో, మార్కెట్ డిమాండ్‌ను అనుసరించి సభ్యులు ఈ పథకాన్ని వినియోగించుకునేలా ప్రోత్సహిస్తున్నామన్నారు.ప్రతీ మహిళ ఆర్థికంగా బలపడాలని… కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తూ… స్వయం సమృద్ధి సాధించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

డిమాండ్ కి తగ్గట్టు గా బిజినెన్ ని పెంచుకోవాలని కలెక్టర్ సూచించారు. అనంతరం వనిత టీ స్టాల్ లో అందరికి కలెక్టర్ టీ ఆర్డర్ చేసి.. అట్టి బిల్ మొత్తాన్ని యజమాని రేణుక కి అందించారు. ఈ కార్యక్రమంలో డి ఆర్డీ ఓ వసంత, మండల స్పెషల్ అధికారి రామారావు నాయక్, ఎంపీడీఓ మల్లికార్జున్, డి టి ఫణి కుమార్, ఏపీఎం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.