రామన్నపేట మండలాన్ని నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలి
కామ్రేడ్ రెబ్బాస్ రాములు తెలంగాణ ఉద్యమకారులు
రామన్నపేట, అక్షిత ప్రతినిధి :
రామన్నపేట మండలాన్ని నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలని తెలంగాణ ఉద్యమకారుడు కామ్రేడ్ రెబ్బాస్ రాములు ప్రభుత్వన్ని కోరారు. అనంతరం వారు మాట్లాడు 1952 సంవత్సరంలో ఏర్పడిన రామన్నపేట,2009 వరకు ఆరుట్ల రామచంద్రారెడ్డి నుండి మొదలు పెడితే కాశీరాం, కొమ్ము పాపయ్య, గుర్రం యాదగిరి రెడ్డి, ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి మొదలగు మహానుభావులు ప్రాతినిధ్యం వహించారు. రామన్నపేటలో నియోజకవర్గ పరిధిలో ఉన్న ఆరు మండలాల ప్రజల బాగోగుల కోసం ఒక గవర్నమెంట్ హాస్పిటల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రైవేట్ ఐఐటి, సబ్ కోర్ట్ మొదలైన అనేక ప్రభుత్వ సంస్థలు ప్రజల సౌకర్యార్థం రామన్నపేటలో నిర్మించారు.ఇదే నియోజకవర్గాన్ని 2008 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఆయంలో జనాభా శాతం తగ్గిందని రామన్నపేటను డిలిమిటేషన్ కమిటీ రద్దు చేసింది.ఇప్పుడు ఇదే నియోజకవర్గాన్ని చౌటుప్పల్, నారాయణపూర్, రామన్నపేట, వలిగొండ, మోత్కూర్ కలిపి నియోజకవర్గ పునర్విభజన శాతం పెరిగిన ప్రకారం ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మూడు నియోజకవర్గాలుగా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందుకు అనుగుణంగా రామన్నపేటను పాత నియోజకవర్గంగా ప్రకటించాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని వారు తెలంగాణ ప్రభుత్వన్ని డిమాండ్ చేస్తున్నది.