పెట్రోల్ పంపల్లో కనీస సౌకర్యాలు కరువు
మంచినీరు, మూత్రశాలలు,ఎయిర్.వంటి కనీస సౌకర్యాలు అందించని నిర్వాహకులు
వరంగల్, అక్షిత బ్యూరో:
పెట్రోల్ పంపులు వినియోగదారులకు సరైన సేవలు అందించడంలో పూర్తిగా విఫలమైతున్నప్పటికీ పట్టింపు లేని అధికారులు కనీస వసతులు పెట్రోల్ బంకులో కల్పించడం లేదు వరంగల్ నగరంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంకుల్లో మంచినీటి సౌకర్యం యూరినల్స్ ఎయిర్ పెట్టడం వంటి దాదాపు ఒకటి రెండు మినహా ఎక్కడ కూడా వినియోగదారులకు సేవలు అందించడం లేదు పోచమ్మ మైదాన్ సెంట్రల్ జైల్ భద్రకాళికి వెళ్ళు దారిలో ములుగు రోడ్డు వద్ద మిల్స్ కాలనీ ఉరుసు హనుమకొండ కాజీపేట మడికొండ వంటి ప్రాంతాల్లో నగర పరిధిలో నిర్వహిస్తున్న పెట్రోల్ పంపుల్లో కనీస సౌకర్యాలు కూడా ఉండడం లేదు.
పెట్రోల్ పంపులు నిర్వహణ నిబంధనల ప్రకారం వినియోగదారులకు అలాగే బాటసారిలకు మూత్రశాలలు మంచినీరు వాహనాల్లో ఎయిర్ పెట్టేందుకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. కానీ పెట్రోల్ పంపు నిర్వాహకులు ఇవేమీ లేకుండా మంచినీరు తమ వద్దనే ఉంచుకుంటూ మూత్రశాలలకు తాళాలు వేస్తూఎయిర్ మిషన్ పనిచేయడం లేదని గాడుకు పెట్టేవారు లేరని వినియోగదారులకు తెగేసి చెబుతున్నారు. వినియోగదారులు ఫిర్యాదు చేసినప్పటికీ ఆయా పంపుల మీద అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఇక పెట్రోల్ సంగతి సరాసరి ఎంత పోస్తున్నారు. కొలతల ప్రకారం వస్తున్నారా లేదా క్వాలిటీ కంట్రోల్ చూడాల్సిన అధికారులు చూడడం లేదు దానివల్ల వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు దీనిపై పెట్రోల్ పంపులు వినియోగదారులకు అందించవలసిన సేవలపై అధికారులు క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.

ఒకవేళ మూత్రశాలలు ఉన్నప్పటికీ అవి సిబ్బంది కోసమే వాడుతూ వినియోగదారులకు అందుబాటులో ఉంచడం లేదు. మంచినీరు కూడా అందుబాటులో ఉంచడం లేదు. దీనిని ప్రశ్నించే వినియోగదారులపై బంకుల్లో పనిచేస్తున్న సిబ్బంది తిరగబడుతున్నారు.
దీనిపట్ల ప్రభుత్వం పెట్రోల్ పంపుల నిర్వహణ తీరును ఎప్పటికప్పుడు పరిశీలించి వినియోగదారులకు అందించవలసిన సేవలు అందించేలా వారికి ఆదేశాలు జారీ చేస్తూ పెట్రోల్ వినియోగించుకున్న వాహనదారులకు కనీస సౌకర్యాలు అందించే విధంగా అధికారులు పెట్రోల్ పంపు యజమాన్యాలకు సూచనలు జారీ చేసి సూచనలు పాటించని యాజమాన్యాలు సిబ్బందిపై చర్యలు తీసుకునేలా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని వినియోగదారులు కోరుతున్నారు.