పీఎంశ్రీ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల నేరేడుచర్ల నందు ప్రపంచ పఠన దినోత్సవం.
నేరేడుచర్ల అక్షిత ప్రతినిధి :
పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేరేడుచర్ల నందు ప్రపంచ పఠన దినోత్సవం ఘనంగా జరిపారు.విద్యార్థులను తేలికగా చదవడాన్ని ప్రోత్సహిస్తూ,పాఠశాల గ్రంథాలయ పుస్తకాలను ప్రదర్శించి,పఠనాసక్తి కలిగేవిధంగా పుస్తకాలను పరిచయం చేశారు. ఇట్టి కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బట్టు మధు మాట్లాడుతూ…విద్యార్థులు పుస్తకాలు చదవడంలో ఆసక్తి పెంపొందించుకోవాలని, మానసికోల్లాసానికి జ్ఞానసముపార్జనకు పుస్తక పఠనం అత్యంత ఆవశ్యకమని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి వీరబాబు, ఎం సైదులు, రషీద్ ఖాన్, జానకిరాములు, శౌరి, వెంకటేశ్వరరావు,అన్నపూర్ణ,నరసింహరావు,నాగమణి,అష్రూమ్,భానుమతి,జానయ్య,వెంకటరెడ్డి, బికోజి యాదగిరి,రామ్మూర్తి,బాలు,శ్రీనివాస్ రెడ్డి,శ్రీనివాసరావు,లాల్ సాహెబ్,సరస్వతి,వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.