సామాన్యుల గొంతుక… రాహుల్
ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణి
అక్షిత న్యూస్, వేములపల్లి :
పార్లమెంట్ లో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ 55 వ జన్మ దిన వేడుకలను గురువారం వేములపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు పుట్టల పెద్ద వెంకన్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాలి కాంతరెడ్డి మాట్లాడుతూ నీతి నిజాయితీ, ధైర్యం,రాజ్యాంగ విలువలతో ముందడుగువేస్తూదేశజంలోని సామాన్యు ప్రజల ఆకాంక్షల గొంతుకగా నిలుస్తున్న ప్రజా నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ గాంధీ పోరాటం యువతకి ప్రేరణగా, ప్రజలకి ఆశగా నిలుస్తోందని న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ కోసం రాహుల్ చూపుతున్న అంకితభావం ప్రజాస్వామ్య బలోపేతానికి ఎంతో అవసరమన్నారు ఆయురా రోగ్యాలతో భవిష్యత్తులో మరిన్ని విజయాలను పొంది కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకితీసుకురావాలని దేశప్రజలుకోరుకుంటున్నరన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి చక్కని సత్యం, ఎన్ఎస్ యుఐ నాయకుడు బొంగర్ల వినోద్, కాంగ్రెస్ నాయకులు దైద గిరి,మాతంగి చంటి, పగడాల వెంకన్న, పుట్టల శ్రీనివాస్, బొంగర్ల సమాధానం, పుట్టల శ్రీను-తాముర్షి,రేమడాల రవి,తో పాటు ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.