సమస్యలకు తావివ్వొద్దు భూ వివాదాలకు చెక్

సమస్యలకు తావివ్వొద్దు

భూ వివాదాలకు చెక్

కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్ నగర్, అక్షిత ప్రతినిధి :

భూ సమస్యలపై భూ భారతి రెవెన్యూ సదస్సులో స్వీకరించిన దరఖాస్తులు నిర్దేశిత సమయం లోగా
పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులకు సూచించారు శుక్రవారం అడ్డాకుల్
మండలం గుడిబండ గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు కలెక్టర్ హాజరై
అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను స్వయంగా వివరాలుఅడిగి తెలుసుకున్నారు.

భూ సమస్యల పరిష్కార వేదికలుగా రెవెన్యూ సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని, తెలిపారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల వివరాల నమోదులో ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. స్వీకరించిన దరఖాస్తులకు రసీదులు అందించాలని, సంబంధిత రిజిస్టర్లలో తప్పని సరిగా వివరాలు నమోదు చేయాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణ నమోదు రిజిస్టర్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. సమస్యల వారీగా అర్జీలను విభజిస్తూ, పక్కాగా రికార్డులను పొందుపర్చాలని అన్నారు. తహసీల్దార్ స్థాయిలో పరిష్కరించదగిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అన్నారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, పూర్తి రికార్డుల ఆధారంగానే వాటిని పరిష్కరించాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking