అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఉన్న పునాదిని కూల్చిన వ్యక్తులపై కేసు నమోదు
అడ్డగూడూరు ఎస్ఐ వెంకటరెడ్డి
అడ్డగూడూర్, అక్షిత ప్రతినిధి:
అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఉన్న పునాదిని కూల్చిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని గోవిందపురం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఉన్న పునాదిని కూల్చిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అడ్డగూడూరు ఎస్సై వెంక రెడ్డికి గోవిందపురం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. అంబేద్కర్ విగ్రహం చుట్టున్న పునాదిని కూల్చిన వ్యక్తులపై ఫిర్యాదు దారుడు వంగూరు నరసింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆసర్ల బీరప్ప s% మల్లుస్వామి, మాధను చిన్నప్ప s% శివయ్య, మేకల పవన్s% యాదగిరి అనే వ్యక్తుల పై కేసు నమోదు చేయడం జరిగిందని అడ్డగూడూర్ ఎస్ఐ వెంకట్ రెడ్డి తెలిపారు.