పల్లాని పరామర్శించిన బిఆర్ఎస్ నాయకులు

పల్లాని పరామర్శించిన బిఆర్ఎస్ నాయకులు

కొమురవెల్లి, అక్షిత న్యూస్:

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ డ్డిని హైదరాబాదులోని ఆయన నివాసంలో బిఆర్ఎస్ నాయకులు ఆదివారం పరామర్శించారు. ఇటీవల ప్రమాదవశాత్తు కాలికి గాయమై శస్త్ర చికిత్స జరిగింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు అభిమానులు ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ కాయిత రాజేందర్ రెడ్డి, చేర్యాల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మల్లేశం, మాజీ ఎంపీటీసీ మెరుగు కృష్ణ, నాయకులు వుడెం గోపాల్ రెడ్డి, అత్కూరి జయరాములు, దుర్గారెడ్డి, దయ్యాల ఆంజనేయులు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking