ఎమ్మెల్యే మందుల సామెల్ పై అసత్య ప్రచారాలు మానుకోవాలి

ఎమ్మెల్యే మందుల సామెల్ పై అసత్య ప్రచారాలు మానుకోవాలి
కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు నిమ్మల గోటి జోజి

అడ్డగూడూర్, అక్షిత ప్రతినిధి:

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ పై అసత్య ప్రచారాలు మానుకోవాలని అడ్డగూడూరు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు నిమ్మనగోటి జోజి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మండల పరిధిలోని ధర్మారం గ్రామం నుంచి చెరువు మట్టి తరలింపులో ఎమ్మెల్యే పాత్ర ఉందని కొందరు పనిగట్టుకొని ఎమ్మెల్యే పై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. చెరువు మట్టికి ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. మైనింగ్ ద్వారా పర్మిషన్ తీసుకొని గ్రామ రైతులు చెరువు మట్టిని పొలం పనులకు వినియోగించుకుంటున్నారు అన్నారు . మరొకసారి ఎమ్మెల్యే పై అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. ఈ సమావేశంలో మోత్కూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సిరెడ్డి, పాశం సత్యనారాయణ, చిప్పలపల్లి పరశురాములు, గోలి రాంరెడ్డి, బోడ యాదగిరి, బాలెంల సురేష్, డప్పు వెంకన్న, కప్పల రమేష్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking