పదవ తరగతి అర్హతతో డ్రోన్ శిక్షణ

పదవ తరగతి అర్హతతో డ్రోన్ శిక్షణ

-గ్రామీణ ప్రాంత యువతులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి

-మహిళా ప్రాంగణాధికారిణి వేల్పుల విజేత

ఖమ్మం /అక్షిత బ్యూరో :

ప్రస్తుత సమాజంలో డ్రోన్ శిక్షణకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని స్థానిక మహిళల కోరిక మేరకు పదవ తరగతి అర్హతతోనే డ్రోన్ శిక్షణ ను మహిళా ప్రాంగణంలో ఇస్తున్నామని జిల్లా మహిళా ప్రాంగణాధికారిణి వేల్పుల విజేత ఒక ప్రకటనలో తెలియ చేసినారు. రాబోయే పంట కాలాన్ని దృష్టిలో పెట్టుకొని పొలంలో విత్తనాలు వేయుటకు పురుగుమందులు పిచికారి చేయుటకు నేటి ఆధునిక సమాజంలో డ్రోన్ పరికరాలను విరివిగా వినూత్నంగా ఉపయోగిస్తున్న సంగతి మనందరికీ విధితమే కావున పదో తరగతి చదువుకున్న మహిళలు ఇట్టి డ్రోన్ శిక్షణకు ను ఉపయోగించుకొని రాబోయే కాలంలో వ్యవసాయ ఉద్యానవన తదితర శాఖలలో ఉద్యోగ అవకాశాలు పొందేందుకు అవకాశాలు విరివిగా ఉన్నాయని వాటిని వినియోగించుకోవాలని తెలియజేశారు.గ్రామీణ / పట్టణ ప్రాంత డ్వాక్రా గ్రూపులలో ఉన్న మహిళలు ఇట్టి శిక్షణను తీసుకుంటే వారికి శిక్షణ ను అందించి డ్రోన్ పరికరాన్ని కూడా సబ్సిడీలో అందిస్తామని తెలియజేశారు. కావున ఆసక్తి ఉన్న పదవ తరగతి పూర్తి చేసిన మహిళలందరూ స్థానిక మహిళా ప్రాంగణం టేకులపల్లి నందు జూన్ 24 నుండి జూన్ 28 వరకు తమ దరఖాస్తులు అందించాలని తెలియజేసినారు. ఏమైనా సందేహాలు ఉంటే 7660022512 నెంబర్ లో సంప్రదించాలని కోరినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking