బీసీ స్టడీ సర్కిల్లో సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం
-జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం/అక్షిత బ్యూరో :
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని డిగ్రీ పాసైన అభ్యర్ధులకు సివిల్ సర్వీస్ లాంగ్ టర్మ్ (ప్రిలిమ్స్ మెయిన్స్) పరీక్ష 2026 కోసం జూలై 12 న నిర్వహించే ఆన్ లైన్ స్కీన్రింగ్ టెస్ట్ ద్వారా ఉచిత శిక్షణకు ఎంపిక చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ తెలియజేశారు. కోచింగ్ తరగతులు జూలై 25 నుండి వచ్చే సంవత్సరం ఏప్రిల్ 30 వరకు టీజీబీసిఇఎస్డీటీసీ (టిజి బిసి స్టడీ సర్కిల్) లక్ష్మీనగర్ కాలనీ సైదాబాద్ హైదరాబాద్ 500059 లో నిర్వహించబడుతుంది. 150 మంది అభ్యర్ధులకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. వీరిలో 100 మంది ప్రతిభావంతులైన విద్యార్ధులను జూలై 12న నిర్వహించే ఆన్ లైన్ స్కీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.మరో 50 మంది అభ్యర్థులను గతంలో సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్) పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని ఎంపిక చేయడం జరుగుతుంది. వీరు సంబంధిత పత్రాలతో నేరుగా టీజీబీఇఎస్డిటిసి (టీజీ బీసీ స్టడీ సర్కిల్) రోడ్ నంబర్ 8 లక్ష్మీనగర్ కాలనీ సైదాబాద్ హైదరాబాద్-500059లో జూన్ 16 నుంచి జూలై 8 లోగా దరఖాస్తు సమర్పించిన వారిని ఎంపిక చేయబడుతుంది. ప్రవేశం పొందిన అభ్యర్ధులకు లాడ్జింగ్ బోర్డింగ్ రవాణా ప్రయోజనం కోసం నెలకు రూ.5000 సైఫండ్ రూ.5000 బుక్ ఫండ్ ఒక్కసారి మాత్రమే అందించబడుతుంది. గ్రంథాలయ సదుపాయం కల్పించడం జరుగుతుంది.100 మంది ప్రతిభావంతులైన విద్యార్థుల ఎంపికకు సంబంధించి జూన్ 16 నుంచి జూలై 8 డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు. టీజీబీసీ స్టడీ సర్కిల్ సీజీజీ జీవోవీ ఇన్ లో అప్ లోడ్ చేయాలి. ఇతర వివరాలకు 9573859598,9441931359 నంబరును లేదా టిజిబిసి స్టడీ సర్కిల్ ఖమ్మం ఎన్టీఆర్ సర్కిల్ బైపాస్ రోడ్ ఖమ్మంలోని బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలతను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కోరారు.