రైతులతో సీఎం
రేవంత్ రెడ్డి ముఖాముఖి
*జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బి.వెంకటేష్
మహబూబ్ నగర్, అక్షిత ప్రతినిధి :
వానాకాలం 2025 కి సంబంధించి పంట సాగు కై పెట్టుబడి సాయాన్ని రైతు భరోసా పథకం ద్వారా నిధులను విజయవంతంగా రైతుల ఖాతాలో జమ చేసిన సందర్భంగా ( జూన్ 24) న సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, హైదరాబాద్ సచివాలయం వద్ద రైతు సదస్సు నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బి.వెంకటేష్ తెలిపారు.
ఈ సదస్సులో ముఖ్యమంత్రి తో పాటు,మంత్రులు పాల్గొంటారు.ఈ కార్యక్రమాన్ని జిల్లాలో రైతు నేస్తం రైతు వేదికల ద్వారా ప్రత్యక్ష ప్రసారం కు ఏర్పాట్లు చేసినట్లు,ప్రజా ప్రతినిధులు,అధికారులు హాజరు కానున్నట్లు తెలిపారు. రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బి.వెంకటేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు,
ఈ కార్యక్రమాన్ని జిల్లాలోనీ (48) రైతు వేదికలలో పండుగ వాతావరణం లో నిర్వహించేందుకు ప్రతి రైతు వేదిక వద్ద అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు డిఏఓ పేర్కొన్నారు. ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్ గా మండల స్థాయి అధికారులు నియమించినట్లు తెలిపారు
అన్నదాతకు అండగా ఖరీఫ్ పంటలకు ఆర్థిక భరోసా
దేశానికి వెన్నెముక అయిన రైతన్నను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రారంభించిన రైతు భరోసా పథకం ద్వారా జిల్లా లో ఇప్పటివరకు 2,08,200 మంది రైతులు లబ్ధి పొందారని జిల్లా వ్యవసాయ అధికారి బి.వెంకటేష్ తెలిపారు రైతులకు వానాకాలం పంట సాగులో పెట్టుబడి అవసరాలను తీర్చేందుకు రాష్ట ప్రభుత్వం మద్దతుగా నిలుస్తూ రైతు భరోసా పథకం ద్వారా అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో ఆర్థిక సహాయం ప్రభుత్వం జను చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో వానాకాలం 2025 రైతు భరోసాలో భాగంగా పంట పెట్టుబడి సాయం కింద 2,08,200 మంది రైతులకు గాను. 229 కోట్ల 65 లక్షల 50 వేల 566 రూ.లు నిధులు నేరుగా రైతుల ఖాతాలో జమ కావడం జరిగిందని ఆయన తెలిపారు.
జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో 2,00,000 ఎకరాల్లో వరి, 85,000 ఎకరాల్లో పత్తి, 30,000 ఎకరాల్లో మొక్క జొన్న, 10,000 ఎకరాల్లో కందులు తదితర వంటలు కలిపి మొత్తం 3,68,000 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసేందుకు రైతులు సమాయాత్తమవుతున్నారని తెలిపారు. అందుకోసం 38,787 మెట్రిక్ టన్నుల యూరియాను విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. నకిలీ విత్తనాలు అమ్మకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ పర్యవేక్షణ చేస్తున్నామన్నారు.
రైతన్నల హర్షం
రైతు భరోసా పడింది.. రుణమాఫీ అయింది..
గండీడ్ మండలం, జంగం రెడ్డి గ్రామానికి చెందిన శ్రీ కొండారెడ్డి గారికి 5 ఎకరాల 13 గుంటల భూమి ఉండగా 31,950/- రూపాయలు రైతు భరోసా కింద ప్రభుత్వం తనకు సహాయం చేసిందని, వానాకాలం పంట పెట్టుబడికి ఈ సాయం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. రైతుల పక్షాన నిలబడు తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దన్యవాదాలు తెలిపారు.
ఎరువులు, విత్తనాలకు వాడుతాము…
అడ్డాకల్ మండలం, కన్మనూర్ గ్రామానికి చెందిన శ్రీ అగ్గి రాములు అనే రైతుకి 6 ఎకరాల భూమి ఉండగా పెట్టుబడి సాయం కింద 36,000 రూపాయలు జమ అయ్యాయి, సమయానికి ఎరువులు, విత్తనాలు కొనుకునేందుకు ఈ డబ్బులు ఉపయోగ పడతాయని సంతోషం వ్యక్తం చేసి ప్రభుత్వనికి కృతజ్ఞతలు తెలిపారు.