డ్రగ్స్ నిర్మూలన మనందరి బాధ్యత

డ్రగ్స్ నిర్మూలన
మనందరి బాధ్యత

*ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మహేశ్వర్ రెడ్డి
మిర్యాలగూడ, జూన్ 26 అక్షిత ప్రతినిధి :
విద్యార్థులు, యువత డ్రగ్స్ నిర్మూలనలో బాధ్యత వహించాలని తమ జీవితాలను, సమాజాన్ని డ్రగ్స్ బారిన పడకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ కాపాడుకోవాలని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఇన్స్పెక్టర్ ఎల్.మహేశ్వర్రెడ్డి సూచించారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా స్థానిక కేఎన్ఎమ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎక్సైజ్ శాఖ, కళాశాల ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, యాంటి డ్రగ్ కమిటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ ఎమ్. శివకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు.

ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అంటూ అందరూ డ్రగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని శివకృష్ణ పేర్కొన్నారు. ఎస్ఐ రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ ఎవరైనా డ్రగ్స్ అమ్మడం కానీ కొనడం గమనిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో యాంటీ డ్రగ్ కమిటీ కన్వీనర్ డాక్టర్ జి.నరేష్, ఐక్యూఎసి కోఆర్డినేటర్ పి.నాగరాజు, లావణ్య ఎస్ఐ, పర్వీన్, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking