ఉక్కు సంకల్ప దీక్ష

*ఉక్కు సంకల్ప దీక్ష*

తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు సాధించాలనే ధృఢ సంకల్పంతో మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధినేత కవిత చేపట్టిన ఉద్యమం సామాజిక న్యాయం కోసం సాగుతున్న ఓ శక్తివంతమైన ప్రజా పోరాటంగా మారింది. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు ఒక సామాజిక న్యాయం సాధన పోరాటంగా కవిత 72 గంటల దీక్ష చేపడుతున్నారు. బీసీలకు రాజ్యాంగబద్ధ హక్కులు, రిజర్వేషన్ల సాధన లక్ష్యంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కవిత చేపట్టిన ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ కలిగిస్తోంది. ఈ ఉద్యమం అన్ని వర్గాల నుంచి, ముఖ్యంగా బీసీ సమాజం, యువత, మహిళల నుంచి విశేష స్పందన పొందుతోంది.

ఇటీవలి కాలంలో కవిత చేపడుతున్న బీసీ ఉద్యమ కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యాన్ని రేకెత్తించాయి. పార్టీ అధికార మద్దతు లేకపోయినా, ఆమె ఉద్యమానికి ప్రజల్లోనూ సామాజిక వర్గాల్లోనూ రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది.

ఆగస్టు 4వ తేదీ నుంచి 72 గంటల పాటు ఇందిరా పార్క్ వద్ద కవిత చేపట్టబోతున్న నిరాహార దీక్షకు ఇప్పటికే పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాలు, బీసీ సంఘాలు, సామాజిక సంస్థలు పాల్గొననున్నట్లు సమాచారం. దీక్ష ద్వారా బీసీ హక్కులపై మరింత అవగాహన పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమెకు ప్రత్యక్ష మద్దతు లేకపోయినా, ప్రజల్లో ఆమెకు లభిస్తున్న ఆదరణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. స్వంత పార్టీ నేతల విమర్శలు కూడా ఆమెను వెనక్కి తొలగించలేకపోయాయి.

మొదట వినతులు, లేఖల రూపంలో సాగిన కవిత పోరాటం — ఇప్పుడు ఉద్యమాల దశకు చేరుకుంది. బీసీల హక్కుల కోసం ఆమె పోరాట పంథా స్పష్టంగా, ధైర్యంగా ప్రజల ముందు ఉంచబడింది. ఈ ఉద్యమం తెలంగాణ రాజకీయాల్లో ఓ కీలక మలుపును సూచిస్తోంది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆమె తీసుకున్న ఈ ప్రయత్నం రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ముఖ్యంగా బీసీ వర్గాలు, యువత, మహిళల నుంచి ఈ ఉద్యమానికి విస్తృత మద్దతు లభిస్తోంది.

కవిత దీక్ష నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పార్టీల నిర్ణయాలు – అనేవి రాజకీయ ప్రాధాన్యత, సామాజిక హక్కుల అంశాలపై ఆధారపడి ఉంటాయి. ప్రతి పార్టీ తన వ్యూహం, సామాజిక వర్గాలపై తన ప్రభావం, భవిష్యత్తు ఎన్నికల్లో లాభనష్టాలను దృష్టిలో ఉంచుకొని స్పందిస్తుంది. కవిత బీసీ రిజర్వేషన్ల సాధన కోసం చేపట్టే 72 గంటల దీక్షపై వివిధ పార్టీల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో ఆసక్తి రికేతిస్తున్నాయి.

 

డా. మహబూబ్ పాషా
సీనియర్ జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking