చిన్నంబావి మండలంలో 175.80 లక్షలతో కొత్త సబ్ స్టేషన్ ప్రారంభం -ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

  • చిన్నంబావి మండలం వెల్లటూరు గ్రామం లో 175.80 లక్షలతో కొత్త సబ్ స్టేషన్ ప్రారంభం
  • చిన్నంబావి మండలాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లే చర్య: ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

వనపర్తి, అక్షిత ప్రతినిధి: వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం వెల్లటూరు గ్రామంలో రూ.175.80 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన 33/11 కెవి విద్యుత్ ఉపకేంద్రాన్ని శనివారం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపకేంద్ర ఆవరణలో ఓ మొక్కను నాటుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఉపముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. చిన్నారులు పూల వర్షంతో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం పలకడం హర్షణీయంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా క్షణకాలం పాటు కూడా విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకుంటున్న ఉపముఖ్యమంత్రికి ప్రజలు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking