ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్
ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ
సభ్యురాలుగా శృతి ఎంపిక
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఎం.శృతి ఎంపికయ్యారు. అహ్మదాబాద్ లో జరిగిన జాతీయ సమ్మేళనంలో జరిగిన ఎన్నికల్లో శృతి జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా ఎన్నికైనట్లు ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ జాతీయ అద్యక్షులు సహదేవ్ యాదవ్ ప్రకటించారు.

వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ కు విశేషంగా సేవలు అందించిన శృతి ప్రస్తుతం ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖకు అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. జాతీయ కార్య వర్గానికి ఎన్ని కైన శృతికి జాతీయ, రాష్ట్ర శాఖల ఆఫీస్ బేరర్స్ అభినందనలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఎంపిక చేసిన జాతీయ అధ్యక్షులు సహదేవ్ యాదవ్ తో పాటు జాతీయ నాయకత్వానికి శృతి కృతజ్ఞతలు తెలిపారు.