- ఆన్లైన్లో బాలలపై జరుగుతున్న లైంగిక దోపిడి అరికట్టాలి
- చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ ఇండియ,నేపాల్ ప్రోగ్రాం మేనేజర్ శుభ్రత్ పాండే
వరంగల్, అక్షిత బ్యూరో: మంగళవారం తెలంగాణ రాష్ట్ర స్థాయి ఎన్జీవోలతో జరుగుతున్న రెండు రోజుల ముగింపు సమావేశాల్లో భాగంగా చిల్డ్రన్ ఫౌండేషన్ ఇండియా భారత్, నేపాల్ దేశాల మేనేజర్ సుబ్రత్ పాండే మాట్లాడుతూ పిల్లలపైన అనేక వేధింపులు దాడులు ఆన్లైన్ మాధ్యమం గా జరుగుతున్నాయని ఈ ఆన్లైన్ మాధ్యమాలు సోషల్ మీడియా, ఇంటర్నెట్, వెబ్ సైట్ల ద్వారా మరియు ఏఐ టెక్నాలజీ నీ దుర్వినియోగపరుస్తూ దీని ద్వారా పిల్లలను వేధించడం, హింసకు గురి చేయడం తర్వాత పిల్లలను లైంగిక దాడులకు గురి చేయడం అనేది జరుగుతుందని దీనిని నిరోధించడానికి భారత ప్రభుత్వము, పోలీస్ శాఖ అనేక రకాలుగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇంకా పిల్లలపైన లైంగిక దాడులు జరుగుతున్నాయని అయితే సమాజంలో దీనిపైన అవగాహన కలిగించడానికి, పిల్లలకు ,తల్లిదండ్రులకు సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు ఆన్లైన్ వే నిప్పుల నుంచి పిల్లల్ని రక్షించడానికి సరైన అవగాహన కార్యక్రమాలు రూపొందించుటలో రాష్ట్రస్థాయిలో స్వచ్ఛంద సంస్థల పాత్ర ఎంతగానో ఉందని సూచించారు. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని సుమారు 60 ఎన్జీవోస్ ని కలుపుకొని బాలల పైన జరుగుతున్న లైంగిక దాడులకు వ్యతిరేకంగా పనిచేయాలని రాష్ట్రస్థాయి కన్సల్టేషన్ నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ సిస్టర్ సహాయ శ్రామిక వికాస కేంద్రం నాగర్ కర్నూల్ డైరెక్టర్ లక్ష్మణరావు సాధన సంస్థ డైరెక్టర్ మురళి తదితరులతోపాటు సంస్థ ప్రాజెక్టు కోఆర్డినేటర్లు బత్తుల కరుణ, ఎర్ర శ్రీకాంత్, చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ ప్రతినిధులు రిషి ,జెనీఫర్ తదితరులతోపాటు 45 ఎన్జీవోల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు రోజుల వర్క్ షాపు లో భాగంగా రూపొందించిన కార్యచరణ ప్రణాళికను స్వర్ణ భారతి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ పాలడుగుల సురేందర్ సిరి ఎన్జీవో డైరెక్టర్ డాక్టర్ సుధాకర్, సేవ వెల్ఫేర్ సొసైటీ ఐత ఉష భాస్కర్ తో పాటు ఎంపిక చేయబడ్డ సంస్థల ప్రతినిధులు వారి కార్యాచరణ తెలియజేశారు.
