- వరద కాల్వ నిర్మించాలి
- సిపిఎం ఆద్వర్యంలో పంచాయతీ కార్యదర్శి వినతిపత్రం
రామన్నపేట, అక్షిత ప్రతినిధి: రామన్నపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించిన సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు కందుల హనుమంతు.కార్యదర్శి మునుకుంట్ల.లెనిన్. మాట్లాడుతూ సాకలి కుంట నుండి హాస్పటల్ వరకు వరద కాలువ నిర్మించాలని. నేతాజీ క్లబ్ స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా చుట్టూ ఫినిషింగ్ ఏర్పాటు చేయాలని. అన్ని వార్డుల్లో చేతిపంపు బోర్లను పునరుద్ధరించాలని. పద్మశాలి కాలనీ లో మంచినీటి సమస్య పరిష్కరించాలని. మోకాళ్ళ సోమయ్య ఇంటి వద్ద మోరిని నిర్మించాలని. సిసి రోడ్లు డ్రైనేజీ సమస్య పరిష్కరించి పందుల బెడద లేకుండా. ప్రజలు రోగాల బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు. భావనల పెళ్లి బాలరాజు . గొరిగే సోములు తరిగొప్పుల వెంకటరెడ్డి పల్లె లింగస్వామి సల్ల చిన్న రాజు నకిరేకంటి సురేష్.యటవిష్ణు దేవయ్య. తదితరులు పాల్గొన్నారు.
