- గరిడేపల్లి మండల కేంద్రంలో గల ఆర్టీసీ బస్టాండ్ ను రక్షించండి
- బస్టాండ్ ను వినియోగంలోకి తెచ్చి ప్రయాణికుల కష్టాలను తీర్చండి.
- పోకల వెంకటేశ్వర్లు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు
- గరిడేపల్లి సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో ఆర్టీ బస్టాండ్ ముందు ధర్నా
- అనంతరం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కి వినతిపత్రం సమర్పణ
గరిడేపల్లి, అక్షిత ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది రూపాయలను ఖర్చు చేసి ప్రతి మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ ఉండాలనే లక్ష్యంతో, గరిడేపల్లి మండల కేంద్రంలో కూడా ఆర్టీసీ బస్టాండ్ నిర్మించారని, కానీ ఆర్టీసీ సంస్థ వారు పట్టించుకోకపోవడం వలన అది నేడు శిథిలావస్థకు చేరిందని,వెంటనే దానిని మరమ్మతులు చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుక రావాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు ఆర్టీసీ అధికారులు కోరారు.ఈరోజు గరిడేపల్లి మండల సిపిఐ సమితి ఆధ్వర్యంలో,నిరుపయోగంగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ధర్నా చేసి అనంతరం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గరిడేపల్లి కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గరిడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా బస్సులను ఆపటం వలన ట్రాఫిక్ జామ్ అయి ఆక్సిడెంట్లు జరుగుతున్నాయని, దీని వలన ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.ప్రజలకు ఉపయోగ పడవల్సిన ఆర్టీసీ బస్టాండ్ ను, పడావు పెట్టి,వేరే చోట్ల బస్సులను నిలపడం వలన ప్రజలకు కూడా చాలా ఇబ్బంది అవుతున్నదని, లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ ను రన్నింగ్ చేయాల్సిన బాధ్యత ఆర్టీసీ అధికారులపై లేదా అని ప్రశ్నించారు.ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు మేల్కొని ఆర్టీసీ బస్టాండ్ ను వేరే వాళ్ళు కబ్జా చేయకముందే దానిని ఉపయోగంలోకి తీసుకొచ్చి ప్రయాణికులకు అందుబాటులో ఉంచాలని,ప్రయాణికులు బయట బస్సులు ఎక్కి దిగటం వలన ఎండ వచ్చిన, వాన వచ్చినా ఇబ్బంది పడుతున్నారని,అదే బస్టాండ్ అయితే ఈ రకమైన ఇబ్బంది ఉండదని ఆయన అన్నారు. ఆర్టిసి అధికారులు వెంటనే స్పందించి బస్టాండ్ ను ప్రయాణికులకు అనుకూలంగా తీర్చిదిద్ది, బస్టాండ్లోకి బస్సుల రాకపోకలను కొనసాగించకుంటే మునుముందు సిపిఐ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కడియాల అప్పయ్య, ఏఐటీయూసీ జిల్లా నాయకులు సుధాకర్ రెడ్డి,రైతు సంఘం రాష్ట్ర నాయకులు బిల్లా కనకయ్య, సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు, కుందూరు వెంకటరెడ్డి,పోకల ఆంజనేయులు, ప్రతాని సైదులు,పంగ గోవిందు, గోధుమల ఈశ్వర చారి,ముండ్ల కోటయ్య, షేక్ పీర్ సాహెబ్,వేషాల ఆంజనేయులు,ఈదయ్య, నాగాచారి,నందిపాటి కాశయ్య, ఏఐవైఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు పంగా సైదులు, మెండే లింగరాజు తదితరులు పాల్గొన్నారు