గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!

  • గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
  • ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఐపీఎస్

ములుగు, అక్షిత బ్యూరో:  గోదావరి నది పరివాహక ప్రాంతమైన మంగపేట మండలంలోని కమలాపురంలోని ఇంటెక్ వెల్ వద్ద గోదావరి నది ఉధృతిని ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఐపీఎస్ సందర్శించారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నదికి వరద పెరిగి ఉదృతంగా ప్రవహిస్తున్న తరుణంలో ముంపు ప్రాంతాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే ఎవరూ కూడా చేపల వేటకు వెళ్లడం కానీ, పడవలలో నదులు దాటడం కానీ చేయకూడదని హెచ్చరించారు. విపత్కర పరిస్థితులు ఎదురైతే ప్రజలు పోలీస్ శాఖ సహాయం తీసుకోవాలని, డయల్ 100 ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైన వాటిని ఎదుర్కొనేందుకు జిల్లా పోలీస్ శాఖ సంసిద్ధంగా ఉందని, ముంపు ప్రాంతాల ప్రజలకు తక్షణ సహాయం కోసం జిల్లా విపత్తు ప్రతిస్పందన దళాలు డిడిఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ఏ ఎస్పీ శివం ఉపాద్యాయ, ఏటూర్ నాగారం సిఐ శ్రీనివాస్, ఎస్బి ఇన్స్పెక్టర్ శంకర్, మంగపేట ఎస్సై టివిఆర్ సూరి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking