గులాబీ శ్రేణుల రాస్తారోకో

కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరసనగా బిఆర్ఎస్ నాయకుల రాస్తారోకో

చేర్యాల, అక్షిత న్యూస్ :
చేర్యాల పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద జనగామ ఎమ్మెల్యే , బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశం మేరకు గోష్ కమిషన్ అసెంబ్లీలో చర్చకు తావివ్వకుండా కాంగ్రెస్ విధానానికి వ్యతిరేకంగా సోమవారం చేర్యాల పట్టణ, మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పట్టణ, మండల అధ్యక్షులు, ముస్త్యాల నాగేశ్వరరావు, అనంతుల మల్లేశం, రాష్ట్ర నాయకులు ముస్త్యాల బాల నర్సయ్య, మాజీ ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్, జిల్లా సభ్యులు అంకు గారి శ్రీధర్ రెడ్డిలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి కెసిఆర్ పై, బిఆర్ఎస్ పార్టీపై బురద చల్లే రాజకీయంలో భాగమే గోష్ కమిషన్ బిజెపి, కాంగ్రెస్ పార్టీల ద్వారానే కాలేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు నివేదికల ద్వారా డైవర్షన్ చేస్తున్నారని, ఈ విషయంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఎలాంటి ఆనిజరిగిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ మంగోల్ చంటి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ పూర్మ వెంకట్ రెడ్డి, యూత్ ఇన్చార్జి శివ గారి అంజయ్య, పట్టణ కార్యదర్శి బురగోని తిరుపతి గౌడ్, మండల కార్యదర్శి కోతి దాస్, మండల వైస్ ఎంపీపీ తాండ్ర నవీన్ రెడ్డి, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పెడతాల ఎల్లారెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు ఆకుల రాజేష్ గౌడ్, క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షులు బిరెడ్డి ఇన్నారెడ్డి, వార్డు ఇన్చార్జులు, పచ్చి మడ్ల సిద్ది రాములు గౌడ్, మంచాల కొండయ్య, సిద్ధి లింగం గుప్తా, వార్డ్ అధ్యక్షులు కాసెట్టి బాగయ్య, కామల్ల అనిల్ , నాయకులు నర్రా ఐలయ్య, ఎర్రోళ్ల రామచంద్రం, చింతల పరశురాములు, పచ్చి మడ్ల మహేందర్ గౌడ్, పచ్చి మడ్ల మానస , పాక బాలయ్య, బండి సుదర్శనం, బాసి గౌడ్, మనోహర్, వెంకట కృష్ణారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఒగ్గు శ్రీశైలం , గదరాజు యాదగిరి, బంగారు గళ్ళ కిరణ్, బొట్టు శంకర్ , గర్నపెల్లి రామ్ , తాండ్ర సాగర్, కొంగరి గిరిదర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking