ఇద్దరు మంత్రులు ఎక్కడ?

ఇద్దరు మంత్రులు ఎక్కడ?

వారి ఇలాకాలోనే
యూరియా కొరత…!

ఎన్నికలపై ఉన్న
శ్రద్ధ రైతులపై లేదు..!

జిల్లా మంత్రులు
కన్నెత్తి చూడరా…!

అధికారులకు పట్టదా…!

పక్షం రోజులుగా
యూరియా కోసం తిప్పలు..!

త్రిపురారం, అక్షిత న్యూస్ :

త్రిపురారం మండలంలోని పిఏసియస్ వద్ద రైతులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లో యూరియా కోసం బారులు తీరారు. రైతులు మాట్లాడుతూ మన జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నా లేనట్టు ఉన్నది అన్నారు.

వందలాది మంది రైతులు నిత్యం రోడ్డుపైకి వచ్చి యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మాకేం సంబంధం అన్నట్లు మంత్రులు వ్యవహార శైలి ఉంది. పక్షం రోజుల నుంచి నిత్యం యూరియా కోసం తిప్పలు పడుతున్నాము. కానీ ఎవరు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking