దాదా హాజత్ ఉర్సు  ఉత్సవాలకు సర్వం సిద్ధం

దాదా హాజత్ ఉర్సు
ఉత్సవాలకు సర్వం సిద్ధం

సింగూర్ లో 5 నుంచి
  7 వరకు ఉత్సవాలు

పీఠాధిపతి మహ్మద్ అబిద్

  హుస్సేన్ సత్తరుల్ ఖాద్రీ సహేబ్

పుల్కల్, అక్షిత ప్రతినిధి :

పుల్కల్ మండల పరిధిలోని సింగూర్ గ్రామంలో ఈనెల 5 నుంచి 7 వరకు దాదా హాజత్ 80వ ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు దర్గా పీఠాధిపతి మహ్మద్ అబిద్ హుస్సేన్ సత్తరుల్ ఖాద్రీ సహేబ్ ఒక ప్రకటనలో తెలిపారు. గత 80వ సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఉత్సవాలు
కుల,మతాలతకు అతీతంగా వేలాది మంది భక్తులు హాజరౌతారు.

ఉత్సవంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దర్గాను రంగురంగుల దీపాలతో అందంగా అలంకరిస్తారు. ఎంతో పవిత్రత కల్గిన గంధం, చాదర్ ఇంటి నుండి తీసుకొని దర్గాలోకి తీసికెళ్లి కీలక ఘట్టాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. 06వ తేదిన వాలీబాల్ పోటీలు నిర్వహిస్తారు. సాయంత్రం నాతే మై ఫీల్ సమ, అన్నదాన కార్యక్రమం ఉంటుoదన్నారు. ముఖ్య అతిథులు అన్నసాగర్ పీఠాధిపతి హజ్రత్ సుఫీ షా మహ్మద్ ఖలీల్ హుస్సేన్, ఉర్ఫ్ జహీద్ హుస్సేన్ సత్తరుల్ ఖాద్రీ పాల్గొంటారని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking