నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి, అక్షిత ప్రతినిధి: ఆదివారం వనపర్తి పట్టణం ఆర్.జి గార్డెన్‌లో మునీర్ కూతురు వివాహ వేడుక జరిగింది. ఈ వివాహానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగారు.తరువాత పెద్దమందడి మండలం జగత్పల్లి గ్రామానికి చెందిన శేషు, శారదల కుమార్తె చిన్నారి కీర్తన పుష్పాలంకరణ కార్యక్రమానికి హాజరై చిన్నారిని దీవించారు. అనంతరం జగత్పల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు గట్టు యాదవ్ ఇంట్లో కూర్చుని పలు అంశాలపై స్థానిక నాయకులతో చర్చించారు. కార్యక్రమంలో వనపర్తి పట్టణ, పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking