సెప్టెంబర్ 17 న జన్మదిన వేడుకలు జయప్రదం చేయండి 

  • సెప్టెంబర్ 17 న జన్మదిన వేడుకలు జయప్రదం చేయండి 
  • బిజెపి మండల అధ్యక్షుడు పాగర్తి సుధాకర్ 

ఖమ్మం, అక్షిత బ్యూరో: సెప్టెంబర్ 17 న ప్రధానమంత్రి నరేంద్రమోడీ జన్మదిన సంద్భంగా నేలకొండపల్లి మండల అధ్యక్షులు పాగర్తి సుధాకర్ ఆధ్వర్యంలో నరేంద్రమోడీ జన్మదినం కార్యక్రమం నేలకొండపల్లి మండలంలో ఘనంగా నిర్వహించాలని చెర్వుమధరం గ్రామములో బూత్ స్థాయి సమవేశం లో మాట్లాడారు.ఈ కార్య్రమంలో బిజెపి మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.మన ప్రియతమ ప్రధాని ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.దేశ రక్షణకు వారు చేసిన కృషి మర్వలేదని అన్నారు. రాష్ట్ర జిల్లా స్థాయి పిలుపు మేరకు నరేంద్రమోడి పుట్టిన రోజు సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని మండలంలోని బూత్ అధ్యక్షులు మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో మండల ప్రధాన కార్యదర్శి మల్లెబోయిన గోవిందరావు మండల నాయకులు సయ్యద్ మోహినుద్దిన్ గెల్లా నాగసాయి కొండ హర్షవర్థన్ నాయకులు గెల్లా గిరి గెల్లా ప్రవీణ్ బిందు నాగార్జున తేజవాత్ శ్రీనివాస్ కొండా ధనమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking