జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వo

జర్నలిస్టులకు

అండగా ప్రజా ప్రభుత్వo

అమర జర్నలిస్టులకు జోహర్లు

జర్నలిస్టులకు ఇండ్లు కేటాయిస్తాం

మంత్రి సీతక్క 

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

జర్నలిస్టులకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.సోమవారంనాడు నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమి ఆడిటోరియంలో జర్నలిస్టుల సంక్షేమ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హజయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, మీడియా రంగంలో వృత్తిని కొనసాగిస్తూ అమరులైన జర్నలిస్టులకు జోహర్లు అర్పించారు. జర్నలిస్టులు సమాజంలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తారన్నారు.

అదే విధంగా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పని చేస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు అని అన్నారు. అందుకు నిదర్శనం తెలంగాణ ఉద్యమంలో ప్రజల అకాంక్షల మేరకు తమ ఉద్యోగాలు ఉంటాయే ఉండవో అనే సందర్భంగా తెలంగాణ లోని గ్రామీణ విలేకరి నుండి ఉన్నత జర్నలిస్టుల వరకు ప్రతి ఒక్కరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మిగతా సమాజానికి ఆదర్శంగా నిలిచారని వారి సేవలను కొనియాడారు. తెలంగాణ మీడియా అకాడమి చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక చేయూతను అందించడం వలన ఆయా కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని ఆమె అన్నారు. అదే విధంగా జర్నలిస్టులకు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడానికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం వలన క్షేత్రస్థాయిలోని విలేకరులకు ఎంతో మేలు జరుగుతోందన్నారు. ప్రభుత్వం చేపట్టిన గృహా నిర్మాణ పథకంలో ఇండ్లు లేని జర్నలిస్టులకు ఇండ్లను కేటాయించాలని, మరణించిన కుటుంబాలకు హెల్త్ కార్డులు అందజేసేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి తెలియజేశారు.
సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ సిహెచ్. ప్రియాంక మాట్లాడుతూ, మీడియా అకాడమి భవనం బహుళ అంతస్తులలో కొనసాగుతున్నందున అందులో శిక్షణ కొరకు ఆడిటోరియం ఉండడంతో జర్నలిస్టులకు ఏఐ., సోషల్ మీడియా, భాషపై పట్టు కోసం నిరంతరం జర్నలిస్టులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆమె వివరించారు. అదే జర్నలిస్టుల సౌకర్యార్ధం కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరరీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి సూచన మేరకు క్షేత్రస్థాయిలో పని చేస్తున్న పౌర సంబంధాల అధికారులకు మీడియా అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణను ఏర్పాటు చేస్తామన్నారు.

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, 18 మంది మరణించిన వర్కింగ్ జర్నలిస్టుల ప్రతి కుటుంబానికి ఒక లక్ష రూపాయలు, అయిదు సంవత్సరాల వరకు పెన్షన్ మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రమాదాలు/ దీర్గకాలికంగా అనారోగ్యం బారిన పడిన ఆరుగురు వర్కింగ్ జర్నలిస్టులకు లక్ష రూపాయలు, ఒక జర్నలిస్టుకు యాభై వేలు, మొత్తం 24 లక్షల 50 వేల రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను మంత్రి చేతుల మీదుగా లబ్దిదారులకు అందజేయడం జరిగింది. ఇప్పటికే కొన్ని జిల్లాలలో శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు. అంతేగాక ఏ.ఐ., సోషల్ మీడియా, ఉర్దూ, గిరిజన జర్నలిస్టులకు ప్రత్యేక వర్క్ షాప్ లు నిర్వహించి వృత్తిలోని నైపుణ్యాలను ఏలా పెంపొందించుకోవాలో జర్నలిస్టులకు వివరించి అవగాహన కలిగిస్తున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే ములుగు జిల్లాలో శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు చైర్మన్ మంత్రికి తెలియజేశారు. జర్నలిజం వృత్తిలో పని వత్తిడి కారణంగా అకాల మరణాలు, అనారోగ్యాల పాలు అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సంక్షేమ నిధులపై వచ్చే వడ్డీని మాత్రమే జర్నలిస్టుల సంక్షేమానికి వినియోగిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమి కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు, జర్నలిస్టు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking