రెవెన్యూ పెండింగ్ అంశాలపై అదనపు కలెక్టర్ సమీక్షా సమావేశం
తాసిల్దార్ లాగిన్ ఐడి లో పెండింగ్ ఉన్న దరఖాస్తులు త్వరగా పూర్తి చేయాలి..
మండలాల తాసిల్దార్లను ఆదేశించిన అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి
మేడ్చల్, అక్షిత బ్యూరో:
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా తహాసీల్దార్ లాగిన్ ఐడిలో పెండింగ్లో ఉన్న, దరఖాస్తులను త్వరిగతిన పూర్తి చేయాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి తహాసీల్దార్లను ఆదేశించారు.సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా విసి హాల్ లో డిఆర్ఓ హరిప్రియతో కలిసిరె వెన్యూ పెండింగ్ అంశాల పై అదనపు కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి, ఆర్ఓఆర్, టిజిపాస్ దరఖాస్తుల పై సమీక్ష నిర్వహిస్తు త్వరితగతిన పెండింగ్ క్లియర్ చేయాలని తహాసీల్దార్లను ఆదేశించారు. మండలాల వారీగా సమీక్షించి పెండింగ్ కు గల కారణాలను అడిగి తెలుసుకొని తగిన సూచనలు జారీ చేసారు. ప్రభుత్వ భూములను కాపాడే దిశగా చర్యలు తీసుకోవాలని, అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశించారు.
కుల, నివాస ధృవీకరణ పత్రాల జారీలో జాప్యం లేకుండా చొరవ తీసుకొని పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో లా ఆఫీసర్ చంద్రావతి,ఆర్డిఓలు ఉపేందర్ రెడ్డి, శ్యాం ప్రకాష్, తహాసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.