అణగారిన వర్గాల
గొంతుక నవుతా
బీఎస్పీ మిర్యాల
ఇంచార్జిగా దినేష్
పటిష్ట వంతం చేస్తా
పుట్టల దినేష్ కుమార్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
అణగారిన వర్గాల హక్కుల గొంతుకనవుతానని బీఎస్పీ మిర్యాలగూడ నియోజకవర్గ ఇంచార్జి పుట్టల దినేష్ కుమార్ అన్నారు. నూతనంగా బహుజన సమాజ్ పార్టీ మిర్యాలగూడ నియోజకవర్గ ఇంచార్జిగా పుట్టల దినేష్ కుమార్ నియమితులయ్యారు. బహుజన సమాజ్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్లు అథర్ సింగ్ రావు, ఎమ్మెల్సీ సురేష్ ఆర్యల ఆదేశాల మేరకు మిర్యాలగూడ నియోజకవర్గ ఇంచార్జిగా పుట్టల దినేష్ కుమార్ ను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు, బడంగీపేట మాజీ డిప్యూటీ మేయర్ ఇబ్రామ్ శేఖర్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ బెహన్ కుమారి మాయావతి ఆశలకు ప్రతి రూపమైన బహుజనుల సమస్యలను పరిష్కరించేందుకు అవిశ్రాంత కృషి చేస్తామన్నారు. ప్రతి వార్డు స్థాయి నుంచి మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో బిఎస్పీని పటిష్ట వంతం చేస్తామన్నారు. రాజ్యాధికారంతోనే బహుజనుల సామాజిక, ఆర్థిక, రాజకీయ స్వావలంబన సాధ్యమన్నారు. ప్రస్తుత పాలక, ప్రతి పక్షాలు ఆయా కులాలు, వర్గాలకు ప్రాతినిధ్యమిస్తుందని, ఒక్క బీఎస్పీ మాత్రమే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. అణగారిన హక్కుల గొంతుకగా బీఎస్పీ నిలబడుతుందన్నారు.నా మీద నమ్మకంతో నన్ను మిర్యాలగూడ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించి నందుకు రాష్ట్ర అధ్యక్షులు, బడంగీపేట మాజీ డిప్యూటీ మేయర్ ఇబ్రామ్ శేఖర్, రాష్ట్ర కోఆర్డినేటర్లు బాలయ్య, దాగాగ్గిళ్ళ దయానంద్, నిషాని రామచంద్ర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంచాల శ్రీకాంత్ లకు కృతజ్ఞతలు తెలిపారు.