అన్నదానం.. మహాదానం
దుర్గ మాత ఆశీస్సులు
ప్రజలందరిపై ఉండాలి
సిద్దిపేట, అక్షిత ప్రతినిధి :
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల్ చెప్పాల గ్రామానికి చెందిన కంఠం నరేష్ దంపతులు కలిసి దుర్గమాత వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి కుటుంబ సమేతంగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ఆశీర్వాదంతో ప్రజలందరిపైన ఉండాలన్నారు. ఆయురారోగ్యంతో సుఖసంతోషాలతో, పంటలు బాగా పండాలన్నారు. పాడి రైతులు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని దుర్గ మాతను వేడుకొన్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు దుర్గ మాత భక్తులు కమిటీ సభ్యులు యువకులు, రైతులు మహిళలు అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.