రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ పోటీలను ప్రారంభించిన ఎంపి రామసహాయం రఘురామరెడ్డి
ఖమ్మం /అక్షిత బ్యూరో :
ఖమ్మం జిల్లా కేంద్రంలో గల సర్దార్ పటేల్ స్టేడియం లో బాలసాని సన్యాసయ్య మెమోరియల్ రాష్ట్రస్థాయి ర్యాంకింగ్ పోటీలను ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురామరెడ్డి ప్రారంభించారు.క్రీడా కారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ క్రీడలను సమన్వయంతో ఆడాలని క్రీడల్లో గెలుపు ఓటమిలు సహజమని ఓటమి ద్వారానే గెలుపునకు నాంది పలుకుతుందని సూచించారు. రాష్ట్ర స్థాయి పోటీలలో ఖమ్మం జిల్లా సత్తా చాటాలని క్రీడాకారులకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన అన్నారు. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తన తండ్రి బాలసాని సన్యాసయ్య పేరు మీద రాష్ట్రస్థాయి ర్యాంకింగ్ పోటీలు నిర్వహించడం చాలా ఆనందదాయకమని తన కుమారుడు విజయ్ అధ్యక్షులుగా ఈ పోటీలు నిర్వహించడం తనకు సంతృప్తి ఇవ్వడమే కాకుండా క్రీడాకారుల్లోని ఉత్తేజాన్ని నింపుతుందని ఇందుకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు.

బాలసాని విజయ్ మాట్లాడుతూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న మనము ఏదో ఒకటి చేయాలని ఉద్దేశంతో రాష్ట్రస్థాయి నుండి జాతీయ స్థాయి వరకు క్రీడలో పాల్గొంటున్న మన జిల్లా నుంచి ఏదో ఒకటి చేయాలని ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పెద్దల సహకారంతో సర్దార్ పటేల్ స్టేడియంలో కొత్త ఇండోర్ స్టేడియం ను ప్రారంభించుకున్నట్లు బాలసాని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన టేబుల్ టెన్నిస్ ఇండోర్ స్టేడియం ఖమ్మం క్రీడాకారులకు క్రీడల్లో ఎదిగేందుకు తోడ్పాటుని ఇచ్చిందని ఆయన అన్నారు. రాష్ట్రస్థాయి నుండి జాతీయ స్థాయి వరకు టేబుల్ టెన్నిస్ క్రీడల్లో పాల్గొనేందుకు క్రీడాకారులకు అవకాశాలు మెండుగా ఉన్నందున ఏదో ఒకటి అందించాలనే ఉద్దేశంతోనే ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం నందు రాష్ట్రప్రభుత్వ నిధులద్వారా కొత్త ఇండోర్ స్టేడియం ప్రారంభించినట్లు టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు విజయ్ తెలిపారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాల నుంచి టేబుల్ టెన్నిస్ క్రీడలలో రాష్ట్రస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు ఆడిందుకు శిక్షణ ఇచ్చిన కోచ్ వివి సాంబమూర్తి శ్రమ ఎంతో ఉందని కోచ్ గా బద్ధతతో పనిచేస్తూ క్రీడాకారులకు శిక్షణ ఇస్తూ క్రీడల్లో ఎదిగేందుకు తోడ్పాటును అందిస్తూ ఉత్తమ కోచ్ గా రాష్ట్ర అసోసియేషన్ అభినందించింది. ఈ కార్యక్రమానికి తంబూరు సునీల్ కుమార్ డిఎస్ఓ పి నాగేందర్ రెడ్డి జనరల్ సెక్రెటరీ టీ ఎస్ టీటీఏ రవి మారుతి డాక్టర్ జీవీ ప్రవీణ్ డాక్టర్ శశి కుమార్ కొండ శ్రీధర్ రావు డాక్టర్ కృష్ణ సుమంత్ డాక్టర్ గుమ్మడి రాఘవేంద్ర పుట్ట శంకరయ్య కటికల క్రిస్టఫర్ బాబు టెలికాం అడ్వైజరి మెంబర్స్ షేక్ ఇమామ్ బాయ్ ఉమ్మినేని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.