ప్రతిభను వెలికితీసేందుకు
వ్యాసరచన
విద్యార్థులకు ఆన్‌లైన్
వ్యాసరచన పోటీలు
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల, అక్షిత ప్రతినిధి :
పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాల స్మరణలో భాగంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం “పోలీస్ ఫ్లాగ్ డే ” సందర్బంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన ధైర్యవంతులైన పోలీసు సిబ్బందిని స్మరించుకుంటూ తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆన్‌లైన్ వ్యాసరచన పోటీ రైటింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ తెలిపారు. ఈ పోటీలు మూడు భాషల్లో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో6వ తరగతి నుండి పీజీ వరకు ఉన్న విద్యార్థులు పాల్గొనవచ్చుఅని అన్నారు. విద్యార్థులు తమ వ్యాసాలను అక్టోబర్ 28 వ తేదీ లోగా సమర్పించాలని , ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడం జరుగుతుంది అంతే కాకుండా జిల్లా స్థాయిలో 1వ, 2వ, 3వ స్థానాల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేయబడతాయి. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జిల్లా,రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి బహుమతులు పొందాలని ఎస్పి సూచించారు.