నిరుద్యోగ యువతకు ఉపాధి

నిరుద్యోగ యువతకు ఉపాధి

* ఐటి,సేవా,నిర్మాణ, వాణిజ్య, ఫార్మారంగలకు చెందిన 150 కంపెనీలు హాజరుకానున్నాయి

* సుమారు 3000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది

* యువత జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలి

* రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్ నగర్,అక్షిత ప్రతినిధి :

నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 25 న హుజూర్ నగర్ లో పెద్ద ఎత్తున జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది.జాబ్ మేళాకు ముఖ్య అతిధిగా హాజరుకానున్న రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్,ఇండస్ట్రీస్ శాఖ మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు సమాజంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, యువత ఉన్నత చదువులు చదువుకొని ఎలాంటి ఉద్యోగం లభించక నిరుద్యోగంతో కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని, అందుకే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 25న హుజూర్ నగర్ పట్టణంలోని పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన హుజూర్ నగర్ లోని తన క్యాంపు కార్యాలయంలో ఈ నెల 25 న నిర్వహించే జాబ్ మేళా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.సింగరేణి కంపెనీ,పరిశ్రమల శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళా లో ఐటి,సేవా,నిర్మాణ, వాణిజ్య, ఫార్మారంగలకు చెందిన 150 కంపెనీలు హాజరుకానుండగా ,సుమారు 3000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు.2018 నుండి పది,ఇంటర్, డిగ్రీ,ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ లలో ఉత్తీర్ణత సాధించిన వారు ,అలాగే 2026 లో ఉత్తీర్ణత సాధించబోయే వారికి ఈ జాబ్ మేళాలో పాల్గొనేందుకు అర్హత ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి నల్గొండ జిల్లా నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకొవాలని మంత్రి కోరారు.ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పరిశ్రమల ప్రతినిధులు ఈ జాబ్ మేళాకు హాజరై వారికి కావలసిన ఉద్యోగులను ఎంపిక చేసుకోవాలని కోరారు.జాబ్ మేళా కు హాజరయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని,అలాగే స్థానికులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని, స్వర్ణ వేదిక ఫంక్షన్ హాల్ లో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని మంత్రి నిర్వాహకులకు సూచించారు.డీట్ (డి ఈ ఈ టి – డిజిటల్ ఎంప్లాయ్ మెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ ) ప్రతినిధి వంశీ మాట్లాడుతూ మంగళ వారం జాబ్ మేళా పోస్టర్ ను రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్వారా ఆవిష్కరించి క్యూ ఆర్ కోడ్ ద్వారా నిరుద్యోగ యువత రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తామని, అభ్యర్థులకు ముందుగానే ఏ కంపెనీకి అర్హత ఉందో తెలిపే విధంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తామని, 3 నుంచి 5 కంపెనీల ఇంటర్వ్యూలకు హాజరయ్యేవిధంగా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. అభ్యర్థులు కనీస వివరాలతో కూడిన రేజ్యుమ్ లను 5 జిరాక్స్ కాఫిలను తీసుకొని జబ్ మేళా కు రావాలని, ఒరిజినల్ సర్టిఫికెట్స్ అవసరం లేదని స్పష్టం చేశారు.ఈ సమీక్షా సమావేశానికి హుజూర్ నగర్ ఆర్డిఓ శ్రీనివాసులు, సింగరేణి కంపెనీ ప్రతినిధులు శ్రీకాంత్, చందర్, జిల్లా ఉపాధి కల్పన అధికారి శంకర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి,అధికారులు తదితరులు హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking