దక్ష ప్రజాపతి శాలివాహన వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుమ్మరుల భోజన వన మహోత్సవం
ఖమ్మం/అక్షిత బ్యూరో :
ఖమ్మం నగరం ఎమ్ వెంకటాయపాలెం సమీపంలోని దరిపల్లి అనంతరాములు మామిడి తోటలో ఖమ్మం జిల్లా కుమ్మరుల కార్తీక వన సమారాధన కార్యక్రమం ఆనందోత్సాహాలతో నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి చుట్టు పక్కల కుల బంధువులు దక్ష ప్రజాపతి శాలివాహన వెల్ఫేర్ ట్రస్ట్ వారు నిర్వహించిన కార్తీక సమారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆనందోత్సాహాలతో ఆటపాటలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందంగా గడిపి నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో వనభోజన కమిటీ అధ్యక్షులు దరిపల్లి కిరణ్ ఉపాధ్యక్షులు మొగిలిచర్ల వెంకటేష్ ప్రధాన కార్యదర్శి తిగుళ్ళ వెంకటరమణ శ్రీశ్రీశ్రీ దక్ష ప్రజాపతి శాలివాహన సొసైటీ బాధ్యులు ప్రోగ్రాం ఆర్గనైజర్ కానుగుల రాధాకృష్ణ నాంపల్లి పాపారావు ఇలాసాగరపు ప్రసాద్ కొలిచలం చిరంజీవి కొత్తపల్లి సర్వయ్య దరిపల్లి భాస్కర్ రాచర్ల రాజు పోరళ్ల కృష్ణ గుమ్మిడెల్లి సైదారావు కానుగుల వేణు శాతరాజు పల్లి చందు వరికొల్లు నగేష్ వరికొల్లు లక్ష్మీనారాయణ సలహాదారులు కొల్లూరి పరుశురాములు ఎల్ఐసి భద్రయ్య దునుకు వేలాద్రి పాల్గొని ముఖ్యఅతిథిగా హాజరైన వనజీవి రామయ్య సతీమణి జానమ్మను సన్మానించారు.