ఉన్నది ఉన్నట్టు…ఉండదు కనికట్టు

ఉన్నది ఉన్నట్టు…
  ఉండదు కనికట్టు

అక్షిత అక్షరం
   ప్రజల పక్షం

ప్రజాయుధoగా
    అక్షర యజ్ఞం

అక్షిత దినపత్రిక -2026 క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే బిఎల్ఆర్, సబ్ కలెక్టర్ అమిత్, తహసీల్దార్ శర్మ, కమీషనర్ శ్రీనివాస్

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

ఉన్నది ఉన్నట్టు..ఉండదు కనికట్టుగా ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా.. ప్రజల సమస్యలను పరిష్కరించే వేదికగా అక్షిత అక్షర యజ్ఞం సాగిస్తుందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ మల్లెంపాటి, మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్, తహసీల్దార్ శర్మలు అన్నారు. సోమవారం అక్షిత తెలుగు జాతీయ దిన పత్రిక 2026 నూతన క్యాలెండర్ ను మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ మల్లెంపాటి, మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్, తహసీల్దార్ శర్మలు వేర్వేరుగా ఆయా కార్యాలయాల్లో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ మాట్లాడుతూ నిజాలను నిర్భయంగా.. స్వేచ్ఛగా రాస్తూ ప్రజల సమస్యలకు వాస్తవ దర్పణం పడుతుందన్నారు. వివిధ ప్రధాన స్రవంతి కల్గిన పత్రికల్లో విశిష్ట సేవలందించిన అనుభవంతో చీఫ్ ఎడిటర్ దాస్ మాతంగి సారథ్యంలో గత పదహారు ఏళ్లుగా అక్షిత అక్షర సమరం మోగిస్తుందన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పత్రికలు పనిచేస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు. వాస్తవాలకు దర్పణం పట్టేలా అక్షిత అక్షర సమరం సాగిస్తుందన్నారు. అనతి కాలంలోనే పాఠకుల ఆదరణను చూరగొని ప్రధాన స్రవంతి కల్గిన పత్రికలకు ధీటుగా అక్షిత అక్షరం వెలుగొందుతుందన్నారు.

రంగుల హరివిల్లుగా నిత్యనూతనత్వాన్ని సంతరించుకుని అక్షిత క్యాలెండర్ కలర్ ఫుల్ గా బాగుందని ప్రశంసించారు.

అదేవిధంగా సబ్ కలెక్టరేట్ లో సబ్ కలెక్టర్ ఎం. నారాయణ్ అమిత్, డిఏఒ, తహసీల్దార్ శ్రీనివాస్ శర్మ, మునిసిపల్ కమీషనర్ జి.శ్రీనివాస్ లతో పాటు కాంగ్రెస్ నాయకులు మహబూబ్ అలీ, చిలుకూరు బాలు, దేశిడి శేఖర్ రెడ్డి, సీనియర్ పాత్రికేయులు ఖాజా హామీదుద్దిన్, ఎండి.అస్లాo, రంగా శ్రీనివాస్,  మంద సైదులు, బొంగరాల మట్టయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking