ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫ్రంట్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఇంగువ రామకృష్ణ శర్మ ప్రమాణ స్వీకారం
–ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ నేత తుమ్మల యుగేందర్
–కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల చారి
ఖమ్మం/అక్షిత బ్యూరో :
ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫ్రెంట్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర శాఖ నూతనంగా నియమింపబడిన అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకార మహోత్సవము అత్యంత రంగ రంగా వైభవంగా భక్త రామదాసు జన్మ క్షేత్రమైన నేలకొండపల్లి లో శ్రీకర గార్డెన్స్ నందు ఏఐబిఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి సాయినాథ్ అధ్యక్షతన బ్రాహ్మణ ప్రముఖులచే పుర ప్రముఖులచే మరి విశేషంగా విశిష్ట అతిధులుగా విచ్చేసిన కేంద్ర మంత్రివ సముద్రాల వేణుగోపాలాచారి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు తుమ్మల యుగంధర్ కందిబండ నరసింహారావు నూతన కార్యదర్శులతో చే ప్రమాణ స్వీకారం నిర్వహించినారు.తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఇంగువ రామకృష్ణ శర్మ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శ్రీపతి పండితారాధ్యుల సతీష్ చంద్ర తదితర కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించినారు. జిల్లా శాఖ కార్యదర్శిల ప్రమాణస్వీకారం నిర్వహించారు. సముద్రాల వేణుగోపాలచారి ఉపన్యాసిస్తూ బ్రాహ్మణ సంక్షేమనకు ఎప్పుడూ తోడై ఉంటానని బ్రాహ్మణ సంక్షేమ లక్ష్యంగా పనిచేయాలని నూతన కార్యదర్శులకు సూచించారు.తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగ చెర్మన్ గంగు ఉపేంద్ర శర్మ బ్రాహ్మణ బ్రాహ్మణ సంక్షేమాన్ని ఆకాంక్షించారు. అన్నంబట్ల ఫణి కుమార్ శర్మ బ్రాహ్మణ ఐక్యత కొరకు పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్ పార్టీ యువ నేత తుమ్మల యుగంధర్ మాట్లాడుతూ బ్రాహ్మణ అభివృద్ధిని కాంక్షిస్తూ మీకు అండదండగా ఉంటానని ఏ కార్యక్రమంలోనైన తోడుగా ఉంటానని నూతన కార్యవర్గాన్ని అభినందించారు.ఈ మహోత్సవంలో పాల్గొన్న కార్యవర్గ అతిధి ప్రముఖులు దుర్గ ఆంజనేయ కుమార్ శర్మ ఇంగువ ఉమా ప్రసాద్ శర్మ వెన్నంపల్లి నిశాంత్ శర్మ లావణ్య చరణ్ నరసింహా మూర్తి తదితర అతిరథ బ్రాహ్మణ ప్రతినిధులు పాల్గొన్నారు.