అక్షిత నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్
ప్రజా సమస్యలపై అక్షిత కథనాలు సమాజానికి దిశానిర్దేశం : ఎస్పీ రోహిత్ రాజ్
భద్రాద్రి కొత్తగూడెం, అక్షిత ప్రతినిధి :
సమాజ హితాన్ని కేంద్రంగా చేసుకుని, ప్రజా సమస్యలను నిస్సంకోచంగా వెలుగులోకి తీసుకొస్తున్న అక్షిత జాతీయ తెలుగు దినపత్రిక సేవలు ప్రశంసనీయమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ అన్నారు.బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అక్షిత జాతీయ తెలుగు దినపత్రిక–2026 క్యాలెండర్‌ను ఆయన అధికారికంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజల భద్రత, చట్ట పరిరక్షణ, సామాజిక న్యాయం వంటి అంశాలపై అక్షిత పత్రిక నిరంతరం అవగాహన కల్పిస్తూ బాధ్యతాయుతమైన జర్నలిజాన్నికొనసాగించడం అభినందనీయమన్నారు.

గ్రామీణ ప్రాంతాల సమస్యల నుంచి జిల్లా స్థాయి పరిణామాల వరకు, వాస్తవాలను వడపోసి ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో అక్షిత పత్రిక కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా సామాన్యుల గొంతుకగా నిలిచి, ప్రజాస్వామ్య విలువలను కాపాడే దిశగా చేస్తున్న కథనాలు సమాజానికి దిశానిర్దేశం చేస్తున్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో అక్షిత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో డేగల కృష్ణ ప్రసాద్, ఆర్సి ఇంచార్జ్ వెన్నం సతీష్ , భాస్కరాచారి, (విజన్ ఆంధ్ర బ్యూరో) వినోద్ (తెలంగాణ వాణి ) నాగార్జున చారి (జనం సాక్షి) పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్‌కు పత్రిక బృందం కృతజ్ఞతలు తెలిపింది.